Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై 'ఉండవల్లి బాంబు'!

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ

By:  Tupaki Desk   |   22 Sep 2023 12:30 PM GMT
చంద్రబాబుపై ఉండవల్లి బాంబు!
X

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన రిమాండ్‌ ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్‌ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా సీఐడీ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. చంద్రబాబుకు సీఐడీ కస్టడీకి తీసుకోవడానికి అనుమతించింది. అలాగే స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టేసింది.

ఈ పరిణామాల మధ్య ఏపీ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాఫ్తు జరపాలంటూ పిల్‌ లో కోరారు. ఈ కేసుని సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరిన ఉండవల్లి.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిల్‌ ను విచారించడానికి హైకోర్టు స్వీకరించింది. దానికి నంబర్‌ ను కూడా కేటాయించింది. సెప్టెంబర్‌ 27న ఈ పిటిషన్‌ విచారణకు రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేసును సీబీఐ స్వీకరిస్తే ఆయన మరింత ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించి ఒకవైపు ఏపీ హైకోర్టులోనూ, మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బెయిల్, క్వాష్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి సెప్టెంబర్‌ 22న తీర్పు వచ్చింది. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టేసింది. అలాగే ఏసీబీ హైకోర్టు చంద్రబాబు రిమాండ్‌ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయనను సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించనివిధంగా మాజీ ఎంపీ ఉండల్లి అరుణ్‌ కుమార్‌ పిల్‌ రూపంలో చంద్రబాబుకు షాక్‌ ఇచ్చారు. ఏకంగా సీబీఐతో చంద్రబాబును విచారించాలంటూ పిల్‌ దాఖలు చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాఫ్తు జరగాలంటే సీబీఐకి ఇవ్వాలని, సీబీఐ మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో విచారిస్తుందని అరుణ్‌ కుమార్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

సీబీఐతో దర్యాఫ్తు చేస్తే అన్ని రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. హైప్రొఫైల్‌ వ్యక్తులు ఉన్న ఈ కేసు, సంక్లిష్టంగా ఉన్న ఇలాంటి కేసులను సీబీఐ లోతుగా దర్యాఫ్తు చేస్తే ఎన్నో బయటకు వస్తాయని ఆయన అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఏపీ హైకోర్టులో పిల్‌ వేశారు. దీన్ని విచారణకు హైకోర్టు స్వీకరించిన నేపథ్యంలో ఏం తీర్పు వస్తుందో వేచిచూడాల్సిందే.