Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి చంద్ర‌బాబు ఫ‌స్ట్ టాస్క్ ఇదే...!

దీంతో తాజాగా ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కూడా.. చంద్ర‌బాబుతో భేటీ అయిన‌ప్పుడు గ్రామ గ్రామానా.. టీడీపీ జెండా ఎగ‌రేలా చేయాల‌ని

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:18 AM GMT
ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి చంద్ర‌బాబు ఫ‌స్ట్ టాస్క్ ఇదే...!
X

ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోని పెద్ద‌కూర‌పాడులో సాగుతున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర త్వ‌ర‌లో కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లోకి అడుగు పెట్ట నుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే.. వైసీపీ త‌ర‌ఫున నెగ్గిన ఉండ‌వ‌ల్లి శ్రీదేవిపై ఆ పార్టీ వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేశారంటూ..ఆ మెపై పార్టీ అధిష్టానం క‌న్నెర్ర చేసింది.

దీంతో శ్రీదేవి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే, త్వ‌ర‌లోనే ఆమె టీడీపీ చెంత‌కు చేర‌నున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో ప‌లు ద‌ఫాలు ర‌హ‌స్యంగా భేటీ అయిన ఆమె.. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీటే ఇస్తారా? లేక‌.. ప్ర‌త్తిపాడు పంపిస్తారా? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై మ‌రో రెండు సార్లు ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ఎందుకంటే.. తాడికొండ‌లో టీడీపీకి తెనాలి శ్రావ‌ణ్ కుమార్ ఉన్నాడు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయి నా.. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆయ‌న రెడీ అవుతున్నారు.

సో.. ఇక్క‌డ ఉండ‌వ‌ల్లికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉండ‌ద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇదిలావుంటే.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా.. తాడికొండ‌లోనూ.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను విజ‌యవంతం చేయాల‌ని .. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు.

దీంతో తాజాగా ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కూడా.. చంద్ర‌బాబుతో భేటీ అయిన‌ప్పుడు గ్రామ గ్రామానా.. టీడీపీ జెండా ఎగ‌రేలా చేయాల‌ని.. పాద‌యాత్ర‌కు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను తీసుకురావాల‌ని, త‌ద్వారా.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాల‌ని కూడా ఆయ‌న దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు వ‌చ్చే వారం రోజులు కూడా శ్రీదేవి నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండి యువ‌గ‌ళంలో పాల్గొన‌నున్నార‌ని తెలుస్తోంది. అంటే.. వైసీపీకి చెక్ పెట్టేందుకు ఆమె ఇక్క‌డ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని స‌మాచారం.