Begin typing your search above and press return to search.

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తులో ఇదే పెద్ద ట్విస్ట్‌!

అయితే అమిత్‌ షా మాత్రం తమకు ఏడు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపలేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 6:47 AM GMT
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తులో ఇదే పెద్ద ట్విస్ట్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. తమతోపాటు బీజేపీని కూడా కలుపుకోవాలని భావిస్తున్న ఈ రెండు పార్టీల అధినేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అగ్ర నేతలు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పొత్తు, సీట్ల పంపకంపై చర్చలు జరిపారు.

బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు, 6 వరకు శాసన సభ స్థానాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలను కేటాయించినట్టు బీజేపీ నేతలకు చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 శాసనసభ స్థానాలు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే అమిత్‌ షా మాత్రం తమకు ఏడు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేడు కూడా మరో విడత బీజేపీ పెద్దలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 8న జరిగే భేటీలో పొత్తులపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత బీజేపీకి ఇచ్చే సీట్లతోపాటు మిగిలిన స్థానాలకు చంద్రబాబు, పవన్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

అంతేకాకుండా టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో ఉంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిదదే. ఇందులో భాగంగా టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరే అంశంపై కూడా తాజా భేటీలో చర్చలు జరిగినట్టు తెలిసింది.

కొత్త భాగస్వామ్య పక్షాలను ఎన్డీయేలో చేర్చుకునే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే బిహార్‌లో నీతీష్‌ కుమార్, ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్డీ నేత జయంత్‌ చౌధరిని బీజేపీ ఎన్డీయేలో చేర్చుకుంది. నేడో, రేపో ఒడిశాలో బిజూ జనతాదళ్‌ ను కూడా తమ కూటమిలో చేర్చుకోనుంది. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా పూర్తయ్యాయి.

అమిత్‌ షా, జేపీ నడ్డాలతో దాదాపు రెండు గంటలకు పైగా చర్చించిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సీట్ల పంపకం తేలకపోవడంతో ఫిబ్రవరి 8న మరోసారి వారితో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న మొత్తం 25 లోక్‌ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్‌ సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితాను కూడా విడుదల చేసింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం చర్చలు జరిగాయి. అయితే బీజేపీ తమకు ఏడు లోక్‌ సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది. చంద్రబాబు మాత్రం బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో పొత్తుపై పీటముడి పడింది. పొత్తు ప్రక్రియలో సీట్ల పంపకమే పెద్ద ట్విస్టుగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరో విడత జరిగే చర్చల్లో సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.