Begin typing your search above and press return to search.

పీకే వర్సెస్ రిషి : వ్యూహం ఖరీదు అన్ని కోట్లా...!?

ఇక ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవడం ఒక ఎత్తు అయితే ఆయనకు 151 సీట్లు దక్కడం వెనక కచ్చితంగా పీకే వ్యూహాలు చాలా ఉన్నాయని అంటున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 1:16 PM GMT
పీకే వర్సెస్ రిషి : వ్యూహం ఖరీదు అన్ని కోట్లా...!?
X

ఎన్నికల వ్యూహాలకు వ్యూహకర్తలకు డిమాండ్ తెచ్చింది దాన్ని మొదలెట్టింది కచ్చితంగా ప్రశాంత్ కిశోర్ అనే చెప్పాలి. గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఈ తరహా పొలిటికల్ స్ట్రాటజిస్టులు పెద్ద ఎత్తున పెరగడానికి వారితోనే సక్సెస్ అంటూ రాజకీయ పార్టీలు పరుగులు తీయడానికి పీకే ఆద్యుడు అని చెప్పక తప్పదు.

పీకే హిస్టరీలో ఎన్నో విజయాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో గుజరాత్ తో మొదలెట్టి ఆనక ఆయనతో పాటు ఢిల్లీ జాతీయ పాలిటిక్స్ లో అడుగెట్టి ఆయన్ని సీఎం పీఎం లను చేయడంతో తనదైన వ్యూహాలకు పదును పెట్టారు. పీకే ఆ తరువాత బీహార్ బాబు నితీష్ కుమార్ బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే స్టాలిన్ వంటి వారిని తన వ్యూహాలతో సీఎం సీట్లో కూర్చోబెట్టారు.

ఇక ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవడం ఒక ఎత్తు అయితే ఆయనకు 151 సీట్లు దక్కడం వెనక కచ్చితంగా పీకే వ్యూహాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో పీకే ఇపుడు వైసీపీకి ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ శిబిరంలోకి వెళ్తున్నారు. పీకేతో డీల్ కుదిర్చింది నారా లోకేష్ అని అంటున్నారు. ఆయన ఢిల్లీలో పీకేతో కలసి కూర్చుని మాట్లాడాకనే చంద్రబాబుతో పీకే భేటీ సాగుతోంది అంటున్నారు.

ఇక పీకే తెలుగుదేశం పార్టీకి వ్యూహ రచన చేయడానికి తీసుకునే మొత్తం భారీగానే ఉండబోతోంది అని టాక్ నడుస్తొంది. అది ఎంత అంటే ఏకంగా 100 కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఇంత కాస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎవరూ ఉండరేమో. ఇక పీకే టీడీపీకి రానున్న మూడు నెలల పాటు తనదైన మేధస్సుతో సలహాలు సూచనలు వ్యూహాలను అందిస్తారు అని అంటున్నారు.

దాంతో రానున్న కాలంలో టీడీపీ వైసీపీ మీద భారీ సక్సెస్ ని నమోదు చేయడానికి ఉర్రూతలూగుతోంది అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెలంగాణాలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన సునీల్ కనుగోలు పీకే శిష్యుడే. ఆయనే కర్నాటకలో కూడా కాంగ్రెస్ ని గెలిపించడంతో వ్యూహాలను రూపొందించారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే పీకే తెలంగాణాలో అధికార బీఆర్ ఎస్ కి కూడా కొన్నాళ్ళు వ్యూహకర్తగా వ్యవహరించారు. మరి ఆ లెక్కన చూస్తే గురువు మీద శిష్యుడు అక్కడ విజయం సాధించారు అని చెప్పుకోవాలేమో. ఇక ఏపీలో చూస్తే ఐప్యాక్ టీం హెడ్ రిషి రాజ్ సింగ్ కూడా పీకే టీం మెంబర్, ఆయన ఒకనాటి శిష్యుడే అని అంటారు.

ఇదిలా ఉంటే ఐప్యాక్ టీం కి పీకే అడ్వైసర్ గా ఉండేవారు అని అంటారు. మొత్తానికి రిషి రాజ్ సింగ్ కి పీకేకి మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. దాంతో పీకే అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు. అంటే టోటల్ గా చూస్తే ఏపీలో చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ యుద్ధం ఒక వైపు ఉండనే ఉంది.

దానికి మించి ప్రొఫేషనల్ గా ఇద్దరు ప్రత్యర్ధులుగా మారి పీకే రిషీ టీం ఏపీలో అటూ ఇటూ వ్యూహాలతో రచ్చ చేయనున్నారు అని అంటున్నారు. అంటే పీకే నిన్నటి దాకా జగన్ సైడ్ ఇపుడు బాబు వైపునకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి ఈ వ్యూహకర్తల యుద్ధంలో ఎవరిది విజయం అన్నది కూడా చర్చకు వస్తోంది.