Begin typing your search above and press return to search.

తెనాలి సీటు : జనసేనకు ససేమిరా అంటున్న తమ్ముళ్ళు...!?

ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:00 AM GMT
తెనాలి సీటు : జనసేనకు ససేమిరా అంటున్న తమ్ముళ్ళు...!?
X

గుంటూరు జిల్లా తెనాలి సీటు విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు పొత్తులో ఈ సీటు కన్ ఫర్మ్ అని అంతా అంటున్నారు.

అయితే ఇదే సీట్లో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఆయన 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే 2019లో ఇదే సీటు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కి ముప్పయి వేల ఓట్లు లభించాయి. అదే ఆలపాటి రాజాకు 79 వేల ఓట్లు దక్కాయి. అయినా సరే ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతోంది.

ఇక్కడ పోటీకి ఆలపాటి రాజా అన్ని ఏర్పాట్లు చేసుకుని గత అయిదేళ్లుగా చురుకుగా తిరుగుతున్నారు. అయితే ఇపుడు జనసేనతో పొత్తులో భాగంగా ఈ సీటు నాదెండ్లకు పోతుంది అని అంటున్నారు. దాంతో ఆలపాటి రాజాతో సమావేశం అయిన తెలుగుదేశం నాయకులు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయే తెనాలిలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

జనసేనకు ఎలా ఈ సీటు ఇస్తారు అని కూడా వారు ప్రశ్నించారు. అన్నీ విన్న ఆలపాటి ఇంకా ఏ డెసిషన్ చంద్రబాబు తీసుకోలేదని వారిని కూల్ చేశారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆ సీటుని జనసేనకు ఇస్తే మాత్రం కచ్చితంగా తాను ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని రాజా క్యాడర్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంటే నాదెండ్ల పోటీ చేసినా ఈసారి గెలవకుండా ఆలపాటి రాజా వర్గం అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు. నాదెండ్ల గెలిస్తే ఏమవుతుంది అంటే ఆయన నియోజకవర్గంలో బలపడిపోతారు అన్న అభిప్రాయం ఉంది అంటున్నారు. ఆయనకే రేపటి ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే నాదెండ్లకు తెనాలి అప్పగించేసినట్లే అవుతుంది అని అంటున్నారు. అందుకే ఆలపాటి రాజా వర్గం ఈ విషయంలో వద్దు అని చెబుతోంది అంటున్నారు. ఇక రాజాకు గుంటూరు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారంలో ఉన్నా ఆయన మనసు మాత్రం తెనాలి మీదనే ఉంది అని అంటున్నారు. మొత్తం మీద తెనాలి సీటు విషయంలో జనసేనతో టీడీపీకి పంచాయతీ తప్పకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు ఏ విధంగా మ్యానేజ్ చేస్తారో అంటున్నారు.