Begin typing your search above and press return to search.

లోకేష్ కి టికెట్ల ఇక్కట్లు.. బాబు సీరియస్ ...?

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ కి ఎంత కష్టం వచ్చిందంటే ఒక వైపు పాదాలు బొబ్బలెక్కేలా ఆయన నడుస్తున్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:44 AM GMT
లోకేష్ కి టికెట్ల ఇక్కట్లు.. బాబు సీరియస్ ...?
X

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ కి ఎంత కష్టం వచ్చిందంటే ఒక వైపు పాదాలు బొబ్బలెక్కేలా ఆయన నడుస్తున్నారు. ఎండనకా వాననకా నడుస్తున్నారు. యువగళం పేరిట సగం పాదయాత్ర పూర్తి చేశారు. అయితే లోకేష్ పాదయాత్ర చేస్తూ జనాలకు దగ్గర కావాలని చూస్తొంటే ఆయనకు దగ్గర కావాలని టికెట్ ఆశించే వారు అంతా చూస్తున్నారు.

మామూలుగా అయితే లోకేష్ బాబు అపాయింట్మెంట్ చాలా కష్టం. ఇపుడు ఎటూ ఆయన జనంలోకి వచ్చేశారు కాబట్టి టికెట్ రేసులో ఉన్న వారు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారని, టికెట్ ఇప్పించాలని కోరుతున్నారని అంటున్నారు.

లోకేష్ పాదయాత్రలో ప్రతీ రోజూ ఉదయం సెల్ఫీ కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నాయకులు వస్తున్నారుట. వారు అలా వీలు చూసుకుని లోకేష్ ని కలసి తమ కోరికను బయటపెడుతున్నారు అని అంటున్నారు. టికెట్ తమకు ఇప్పించాలని చినబాబుని ఒక్క లెక్కన కాకా పడుతున్నారుట.

ఇక చినబాబు ఈ విషయంలో వారికి హామీ ఇవ్వలేక అలాగని నో చెప్పలేక తరువాత చూద్దామని మెల్లగా నచ్చచెప్పి పంపిస్తున్నారు అని అంటున్నారు. అయితే పాదయాత్రలో కాళ్ళు బూబలెక్కుతూంటే ప్రతీ ఉదయం ఈ విధంగా నేతలు రావడంతో లోకేష్ కి ఒక విధంగా మానసికంగా ఒత్తిడి వీర లెవెల్ లో పెంచేస్తున్నారు అని అంటున్నారు.

ఇక లోకేష్ పడుతున్న అవస్థలు, నాయకులు పెడుతున్న తిప్పలు అన్నీ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చేరాయని అంటున్నారు. దాంతో బాబు సీరియస్ అయ్యారని అంటున్నారు. టికెట్లు ఇచ్చేది ఎవరో కాదు ప్రజలే అని బాబు కొందరు నేతలకు చెప్పేశారు అని అంటున్నారు. సీనియారిటీలు ఇతర క్వాలిఫికేషన్స్ ఏవీ పనిచేయవని, సర్వేలలో ఎవరికి జనాదరణ ఉందో వారు జూనియర్ అయినా కూడా టికెట్ ఇస్తామని బాబు క్లారిటీగా చెప్పేశారు అని అంటున్నారు.

అదే విధంగా పార్టీలో నేతలను కాకా పడితే టికెట్లు రావని జనంలో ఉంటేనే వస్తాయని కూడా కరాఖండీగా చెప్పారని అంటున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ ని కాకా బ్యాచ్ చుట్టుముట్టి ఇలా ఇబ్బందులు పెట్టడం పైన బాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. జరుగుతున్నది యువగళం పాదయాత్ర తప్ప టికెట్ల యాత్ర కాదని ఆయన సుతిమెత్తగా తమ్ముళ్లకు క్లాస్ పీకుతున్నారని అంటున్నారు.

ఇక టీడీపెకి ఇటీవల కాలంలో గ్రాఫ్ బాగా పెరగడంతో చాలా మంది ఆశావహులు టికెట్ల కోసం టీడీపీ వైపు చూస్తున్నారు. ఇపుడే ఒక మాట చినబాబు ద్వారా చెప్పించుకుంటే టికెట్ గ్యారంటీ అవుతుందని, ఆ మీదట తాము చేయాల్సింది చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ అక్కడ ఉన్నది అపర చాణక్యుడు చంద్రబాబు. అందుకే ఆయన టికెట్లు జనంలో ఆదరణ ఉన్నవారికే అని ఒక బిగ్ కండిషన్ విధించారు అని అంటున్నారు మొత్తానికి లోకేష్ పాదయాత్ర లో టికెట్ల ఆశావహులు పెడుతున్న ఇబ్బందులు చూసి బాబు మండిపోతున్నాని అంటున్నారు.