Begin typing your search above and press return to search.

టీడీపీకి అగస్టు టెన్షన్ ... షాకుల మీద షాకులు....?

ఎన్టీయార్ కి మాత్రమే ఆగస్ట్ సంక్షోభం కాదు చంద్రబాబుకూ ఆ గండం నెల అలా వెంటాడుతూనే ఉంది అంటున్నారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 8:38 AM GMT
టీడీపీకి అగస్టు  టెన్షన్  ... షాకుల మీద  షాకులు....?
X

తెలుగుదేశం పార్టీ పుట్టింది మార్చి నెలలో. కానీ ఆగస్టు నెల మాత్రం ఆ పార్టీ పుట్టె ముంచుతూనే ఉంది. 1983లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీయార్ ని ఆయన ప్రభుత్వంలో కో పైలెట్ గా ఉన్న నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగస్టులో దించేసారు. వెన్నుపోటు పొడిచి నాదెండ్ల సీఎం అయ్యారు. అది టీడీపీకి తొలి ఆగస్టు గండం.

ఇక 1995 ఆగస్టు నెలలో ఎన్టీయార్ చిన్నల్లుడు చంద్రబాబు అచ్చం నాదెండ్ల భాస్కరరావు తరహాలోనే అన్న గారికి వెన్నుపోటు పొడిచి తాను సీఎం అయ్యారు. ఇది రెండవ గండం. దాంతో ఆగస్టు అంటేనే టీడీపీకి భయం వణుకు అన్నట్లుగా తయారైంది.

ఎన్టీయార్ కి మాత్రమే ఆగస్ట్ సంక్షోభం కాదు చంద్రబాబుకూ ఆ గండం నెల అలా వెంటాడుతూనే ఉంది అంటున్నారు. 2000 ఆగస్టు నెలలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ కలసి జరిపిన అతి పెద్ద విద్యుత్ ఉద్యమంలో నాడు పోలీసులు జరిపిన కాల్పులలో కొంతమంది ఆందోళనకారులు మరణించారు.

అది బాబుకు ఆగస్టు నెల మిగిల్చిన చేదు అనుభవం. అలా 2004లో చంద్రబాబు ఓటమికి ఆగస్ట్ సంక్షోభం కారణం అయింది. విభజన ఏపీలో కూడా 2015 ఆగస్టు లోనే ఓటుకు నోటు కేసు మూలంగా చంద్రబాబు ఇబ్బంది పడ్డారని గుర్తు చేస్తూ ఉంటారు.

ఇలా ఆగస్టు వస్తే చాలు పార్టీ నాయకులలో ఎవరో ధిక్కార స్వరం వినిపించడం పార్టీని వీడిపోవడం లాంటివి ఎన్నో జరిగాయి. ఇపుడు చూస్తే ఆగస్టు మళ్లీ వచ్చేసింది. టీడీపీకి ఈ యాంటీ సెంటిమెంట్ ఫీవర్ లా పట్టుకుంది అని అంటున్నారు. మరో తొమ్మిది నెలలలో ఎన్నికలు ఉన్నాయి. తెలుగుదేశం ఒక్కసారిగా జోరు పెంచింది.

అయితే ఆగస్టు నెల ఏ విధంగా పార్టీ దశ దిశను మారుస్తుంది అన్న చర్చ అయితే ఉంది. ఈ ఆగస్టులోనే పొత్తుల విషయంలో ఏదైనా జరగాలని అని అంటున్నారు. మరి అది సానుకూలం అవుతుందా లేక ఏమైనా యాంటీ అవుతుందా అన్నదే చర్చగా ఉందిట. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు ఒకటి వెంటాడుతోంది అని అంటున్నారు.

ఈ కేసు విషయంలో ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ఈ నెల 10వ తేదీన హైకోర్టు తుది విచారణ జరుపనుంది.ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని టీడీపీ నేతల మధ్య ఒక స్థాయిలో చర్చ సాగుతోంది. చంద్రబాబు అయితే ఆగస్టు నెలలు లక్కీ మంత్ గా మార్చుకోవాలని చూస్తున్నారు.

ఆయన ఆగస్ట్ ఫస్ట్ నుంచి ప్రాజెక్టుల సందర్శన పేరుతో జనంలో ఉంటున్నారు. యువగళం పాదయాత్ర నారా లోకేష్ ది సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయినా సరే ఆగస్ట్ నెల చివరికి ఏ రకంగా టీడీపీ డెస్టినీని డిసైడ్ చేస్తుందో అని అంటున్నారు. ఇంకా నెల స్టార్ట్ అయింది. ముగిసేవరకూ టీడీపీకి ఈ టెన్షన్ తప్పదని అంటున్నారు.