Begin typing your search above and press return to search.

ఉగాది వేళ టీడీపీ అభ్యర్ధి కంట కన్నీరు !

అయితే ఎంతో విశిష్టమైన ఉగాది పండుగ రోజున టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్ధి రామరాజు అయిన కంట కన్నీరు పెట్టారు.

By:  Tupaki Desk   |   9 April 2024 4:09 PM GMT
ఉగాది వేళ టీడీపీ అభ్యర్ధి కంట కన్నీరు !
X

ఉగాది పండుగ జాతకాలు చెబుతుంది. మంచి చేస్తుంది అంతా ఆశగా ఉంటారు. తమ రాశులు చూసుకుని మేలు జరిగేది ఉందా అని ఆరా తీస్తుంటారు. పంచాంగాలు పట్టుకుని ఒకటికి పదిసార్లు పరిశీలిస్తూంటారు. అయితే ఎంతో విశిష్టమైన ఉగాది పండుగ రోజున టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్ధి రామరాజు అయిన కంట కన్నీరు పెట్టారు.

ఆయన ఉగాది రోజున తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన బాధను అనుచరులు అభిమానుల ముందు వ్యక్తం చేశారు. తాను తన వారి సలహా సూచనలతోనే ముందుకు సాగుతాను అని చెప్పడం విశేషం. ఒక దశలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకోవాలా అన్నది కూడా ఆలోచిస్తాను అంటున్నారు.

అయితే ఉండి ఎమ్మెల్యే రామరాజు బాధను చూసిన అనుచరులు ఆయనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయాలని నినాదాలు చేశారు. మీ వెంట మేమంతా ఉంటామని అన్నారు. అవసరం అయితే ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగాలని కూడా కోరారు మరో వైపు ఆయన అనుచరులు టీడీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ నేత టీడీపీకి ఏమి అన్యాయం చేశారు అని ప్రశ్నిస్తున్నారు.

ఆయన సీటు మార్చవద్దు ఆయననే అభ్యర్ధిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఉండి అసెంబ్లీ సీటు వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజుకు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇది దాదాపుగా ఖరారు అయింది అని అంటున్నారు. రఘురామను కచ్చితంగా అకామిడేట్ చేయాల్సిన బాధ్యతతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.

ఆయనకు టికెట్ ఎంపీగానే ఇప్పించాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో ఉండి నుంచి పోటీకి బాబు సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఉండి అసెంబ్లీ సీటు విషయం తీసుకుంటే రామరాజుకు మరోసారి టికెట్ అంటూ మొదటి దశ జాబితాలోనే చంద్రబాబు ప్రకటించారు.

అపుడు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చాలా మధనపడ్డారు. 2019 ఎన్నికల్లో బాబు కోరిక మేరకు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజు నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2024లో తన సీటు పదిలంగా ఉంటుందనుకుంటే దానిని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే మరోమారు కన్ ఫర్మ్ చేశారు అని ఆయన తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు

అలా ఉండి టీడీపీలో వర్గ పోరు ఒక వైపు సాగుతోంది. ఇపుడు అదే ఉండి సీటుని తీసుకెళ్ళి రామరాజుని తప్పించి రఘురామ చేతిలో పెట్టాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ పరిణామంతో అసలు ఉండిలో ఏమి జరుగుతోంది అన్నది టీడీపీ తమ్ముళ్లకు వేధిస్తున్న ప్రశ్నగా ఉంది.

రఘురామ అంగబలం అర్ధబలం ఉన్న వారు కావడంతో ఆయనకు సీటు ఇస్తున్నారు అని అంటున్నారు. అయితే ఉండిలో మొదటి నుంచి టీడీపీ పటిష్టంగా ఉంది. మరి తమ్ముళ్ళు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు. ఆయనకు ఎంతవరకూ సహకరిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఉగాది వేళ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కంటతడి పెట్టడం మంచి పరిణామం కాదని అంటున్నారు.