Begin typing your search above and press return to search.

టీడీపీ పోరుబాట..చిన్న అయోమయం

చంద్రబాబు అరెస్టుపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తునే మరోవైపు జనాల్లోకి ఇదే అంశాన్ని తీసుకెళ్ళాలని తమ్ముళ్ళు నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   23 Sept 2023 10:27 AM
టీడీపీ పోరుబాట..చిన్న అయోమయం
X

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటు మొదలుపెట్టాలని టీడీపీ నిర్ణయించింది. అప్రజాస్వామిక విధానాలతో, అరాచకపాలనతో జగన్ పరిపాలనచేస్తున్నట్లు టీడీపీ ఎప్పటినుండో మండిపోతోంది. దానికి అదనంగా చంద్రబాబునాయుడు అరెస్టు తోడయ్యింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇరికించి అరెస్టు చేసి చంద్రబాబును రిమాండుకు పంపించారని తమ్ముళ్ళంతా మండిపోతున్నారు. దీనికి నిదర్శనగానే తొందరలోన ప్రభుత్వానికి వ్యతరేకంగా పోరుబాటు మొదలుపెట్టాలని డిసైడ్ చేశారు. విద్వేష రాజకీయాలపై పార్టీ మొత్తం ఏకతాటిపైన నిలవాలని సీనియర్లు డిసైడ్ చేశారు.

తొందరలోనే జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్ధాయిలో ఆందోళనలు చేయాలని అనుకున్నారు. ఇందుకు కలిసొచ్చేపార్టీలతో కార్యాచరణను రెడీ చేసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ పోరుబాటలో ప్రతి ఇంటినుండి ఒకళ్ళు కచ్చితంగా పాల్గొనేట్లుగా జనాలను చైతన్యం చేయాలని కూడా పార్టీ డిసైడ్ చేసింది. చంద్రబాబు అరెస్టుపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తునే మరోవైపు జనాల్లోకి ఇదే అంశాన్ని తీసుకెళ్ళాలని తమ్ముళ్ళు నిర్ణయించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేతలు దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. అయితే ఎవరికి వాళ్ళుగా దీక్షలు, ఆందోళనలు చేయటం కాకుండా సంఘటితంగా చేయాలని అనుకుంటున్నారు. సంఘటితంగా అంటే తమతో కలిసివచ్చేపార్టీలను కూడా కలుపుకుని, మామూలు జనాల్లో కూడా చైతన్యం తెచ్చి వాళ్ళను కూడా భాగస్వాములను చేయాలని పార్టీ అనుకుంటున్నది.

ప్రజలు ఎక్కువగా ఉండే జంక్షన్లలోను, రద్దీ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలన్నది పార్టీ నిర్ణయం. పార్టీ నేతలు, క్యాడర్ మాత్రమే ఆందోళనలు చేసినంతమాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదని తమ్ముళ్ళకు అర్ధమైంది.

అందుకనే పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని అప్పుడే రాష్ట్రమంతా చంద్రబాబు అరెస్టుపై ఉద్యమించినట్లు ఉంటుందన్నది పార్టీ నేతల ఆలోచన. అయితే ఇక్కడో సమస్యుంది. అదేమిటంటే టీడీపీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్, వామపక్షాలు సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే ఈ మూడుపార్టీలు ఇండియాకూటమిలో కీలకంగా ఉన్నాయి. చంద్రబాబు ఏమో ఏ కూటమిలోను లేరు. పైగా ఎన్డీయేలో పార్టనర్ గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు రెడీ అంటున్నారు. ఈ అయోమయంలో నుండి చంద్రబాబు ముందు బయటపడాల్సుంటుంది. బీజేపీతో పొత్తా లేకపోతే ఇండియాకూటమితో చేతులు కలపటమా అన్నది తేల్చుకోవాలని పై పార్టీలు చెబుతున్నాయి. మరీ అయోమయం ఎప్పుడు తేలుతుందో చూడాలి.