Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫేస్టో రిలీజ్...!?

ఈ మ్యానిఫేస్టో రిలీజ్ కి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరవుతారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 3:49 AM GMT
టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫేస్టో రిలీజ్...!?
X

తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫేస్టో ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభలో రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మ్యానిఫేస్టో రిలీజ్ కి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అలాగే సినీ నటుడు బాలయ్య లోకేష్ కలసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు

ఇదిలా ఉంటే టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫేస్టోలో ఏముంది అన్నది ఆసక్తిని రేపుతోంది. చాలా కీలక హామీలను ఇందులో ప్రస్తావించబోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు తెలంగాణాలో పాపులర్ అయిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ అయిన కుటుంబాల మహిళలకు నెలకు రెండు వేల నుంచి మూడు వేల దాకా ఆర్థిక సాయం తో పాటు రైతాంగానికి యువతకు నిరుద్యోగులకు కూడా భారీ హామీలు ఉంటాయని అంటున్నారు.

అంతేకాదు రైతుల కోసం రుణమాఫీ పధకాన్ని అమలు చేస్తామని ఈ రెండు పార్టీలు చెప్పబోతున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది. అలాగే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం, అలాగే జనసేన హామీలు అయిన యువతకు పది లక్షల రూపాయలతో స్వయం స్వావలంబనగా వ్యాపారం కోసం నిధుల కేటాయింపు వంటివి కూడా ఉంటాయని అంటున్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అన్నది కీలక డిమాండ్ గా ఉంటుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఈ డిమాండ్ ని కనుక తలకెత్తుకుంటే అది మోయలేని భారం అవుతుంది అని అంటున్నారు. అయితే గంపగుత్తగా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు మాత్రం ఈ కూటమికి పడతాయి అని అంటున్నారు.

అలాగే రైతు రుణ మాఫీ విషయంలో కూడా కీలకమైన హామీగా చూస్తున్నారు. అయితే ఇది 2014లో టీడీపీ ఇచ్చి ఇబ్బంది పడిన హామీయే. మరి దీన్ని రైతులు ఎంతవరకూ నమ్ముతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న అమ్మ ఒడి సహా ఇతర సంక్షేమ పధకాలను పేరు మార్చి కొత్త హామీలుగా ఇవ్వబోతున్నారా అన్నది చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి మ్యానిఫేస్టోని రిలీజ్ చేయాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఈ నెలాఖరులో అభ్యర్ధుల తొలి విడత జాబితా కూడా రిలీజ్ చేయనున్నారు అని అంటున్నారు. ఇక కొందరు ముఖ్య నాయకుల చేరికతో ఉత్తరాంధ్రాలో కూటమికి ఊపు తీసుకుని రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ సభ భారీ హడావుడితోనే అనేక అంచనాలోనే సాగనుంది అని అంటున్నారు.