జగన్ కంటే రెట్టింపు ....టీడీపీ జనసేన పవర్ ఆస్త్రం...!
ఇది ఫుల్ సక్సెస్ అయింది. ఇపుడు దాన్నే పవర్ అస్త్రంగా ఉపయోగించి పవర్ ని పట్టాలని టీడీపీ జనసేన చూస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2023 8:00 AM ISTరేపటి ఎన్నికల్లో విజయం కచ్చితంగా అందుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. దాని కోసం ఆయన తన పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. జగన్ సహజంగా డైనమిక్ లీడర్. ఆయన పాలిటిక్స్ ని అలాగే చూస్తారు. అలాగే చేస్తారు. ఇక జగన్ సంక్షేమం విషయంలో ఎక్కడా తగ్గలేదు. విభజన వల్ల పూర్తిగా కునారిల్లిన ఏపీలో జగన్ ఇచ్చిన మ్యానిఫేస్టోని అసలు అమలు చేయలేరని అంతా భావించారు. కానీ జగన్ అప్పో సొప్పో చేసి మొత్తం అయిదేళ్ళూ ఏ ఒక్క పధకం ఆగిపోకుండా అమలు చేశారు.
అది ఆయన ఖాతాలో అతి పెద్ద క్రెడిట్ గా మారింది. ఇచ్చిన మాటను తప్పడని కూడా పేరు వచ్చింది. ఇక సంక్షేమం తో జగన్ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది. యాభై శాతం పైగా ఓటు షేర్ తో జగన్ కి మరో మారు అధికారం లభిస్తే అది విపక్షాలకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పటిదాకా నెగిటివి ఓటుని చీలుస్తామని చెబుతూ వస్తున్న విపక్ష కూటమి తెలంగాణా ఎన్నికల తరువాత రూట్ మర్చింది. వైసీపీ పాజిటివ్ ఓట్ మీద గురి పెట్టేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే రెట్టింపు ఇవ్వాలని పక్కాగా డిసైడ్ అయింది. దీని కోసం తాము చేస్తున్న కసరత్తుతో పాటుగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన పధకాలను కూడా దగ్గరపెట్టుకుని మరీ అదిరిపోయే మ్యానిఫేస్టోని తయారు చేసే పనిలో టీడీపీ జనసేన ఉన్నాయని అంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ఆకర్షణీయమైన హామీ ఇచ్చింది.
రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ని ఇవ్వాలని ఎన్నికల గ్యారంటీ హామీగా ఇచ్చింది. ఇది ఫుల్ సక్సెస్ అయింది. ఇపుడు దాన్నే పవర్ అస్త్రంగా ఉపయోగించి పవర్ ని పట్టాలని టీడీపీ జనసేన చూస్తున్నాయని అంటున్నారు. కర్నాటకలో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉచిత విద్యుత్ పధకం కీలకం అయింది అని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. దాంతో తెల్లకార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబానికి ఈ పధకం వర్తించేలా హామీని ఇవ్వబోతున్నాయి.
అదే విధంగా మరో పవర్ ఫుల్ హామీగా రైతులకు రుణ మాఫీని ప్రకటించబోతున్నాయని అంటున్నారు. రైతులు అత్యధిక శాతం దీని వల్ల లబ్ది పొందుతారు అని అంటున్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో వైసీపీ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టే విధంగా ఈ హామీ ఉంటుందని భావిస్తున్నాయి.
ఇక ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల దాకా రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చింది. దాంతో తాము కూడా అలాంటి హామీ ఇవ్వాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయని అంటున్నారు. అయితే గతంలో లక్ష రూపాయల దాకా రుణ మాఫీ చేస్తామని టీడీపీ 2014లో హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. మరి ఈసారి ఏ విధంగా చేస్తుందో చూడాలని అంటున్నారు.
ఇక ఇప్పటిదాక టీడీపీ జనసేన ఉమ్మడి మానిఫేస్టో కానీ అంతకు ముందు రాజమండ్రి మహానాడు సందర్భంగా టీడీపీ రిలీజ్ చేసిన మినీ మ్యానిఫేస్టో కానీ జనంలో ఆకట్టుకోలేకపోయాయని అంటున్నారు. దాంతో గెలిచిన రాష్ట్రాలలో మంచి పధకాలను హామీలను తీసుకుని గట్టిగానే టీడీపీ జనసేన ఎన్నికల ప్రణాళికను రూపొందించాలని చూస్తున్నాయి.
అయితే టీడీపీ జనసేన బీజేపీ 2014 లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాయని జగన్ పాదయాత్రలో ప్రచారం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయన తుచ తప్పకుండ వెల్ఫేర్ స్కీమ్స్ ని అమలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే రైతు రుణ మాఫీని ఈసారి తాము అధికారంలో ఉండగానే జగన్ ప్రకటించి ఎన్నికలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే జరిగితే పవర్ అస్త్ర మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.
