Begin typing your search above and press return to search.

బాబు ఈజ్ గ్రేట్ : ఒక్కటైన బీజేపీ కమ్యూనిస్టులు!

కానీ ఒక్క పార్టీ విషయంలో ఒక రాజకీయ నేత విషయంలో ఇలా పోటీ పడుతున్నారా అన్న అనుమానాలు అయితే ఉన్నాహ్యి

By:  Tupaki Desk   |   9 Sep 2023 8:12 AM GMT
బాబు ఈజ్ గ్రేట్ :  ఒక్కటైన బీజేపీ కమ్యూనిస్టులు!
X

వామపక్షాలను ఏడమ అంటారు. కుడి వైపు వాదనలకు సిద్ధాంతలకు వారి భిన్నంగా రియాక్ట్ అవుతారు. తాము తప్ప అన్నీ బూర్జువా పార్టీలు అని ఒక పిడి వాదాన్ని వారు ఎపుడూ లేవనెత్తుతారు. ఇక వామపక్షాలకు మిగిలిన పార్టీలతో ఎలా ఉన్నా బీజేపీతో లడాయి మాత్రం పూర్తిగా సిద్ధాంతబద్ధమైంది.

వామపక్షాలు ఎడమ అయితే బీజేపీ కుడి వైపు అన్న మాట. అంత తేడా ఆ రెండు పార్టీల మధ్య ఉంది. ఇలా కుడి ఎడమల భేదాలతోనే దశాబ్దాల కాలంగా రెండు పార్టీలు వాదించుకుంటూ వస్తున్నాయి. ఒకరు ఉన్న చోట వేరొకరు ఉండరు. ఈ రెండు పార్టీలు చూసే దృక్కోణం కూడా వేరేగా ఉంటుంది అంటారు.

కానీ ఏపీ వరకూ వచ్చేసరికి మాత్రం ఈ రెండు పార్టీలూ ఒక్కటిగా ట్యూనప్ అవుతున్నాయి. కుడి ఎడమల తేడా లేకుండా ఒక్కటే స్వరాన్ని ఆలపించడం విశేషం. అది కూడా ఒకరితో మరొకరు పోటీ పడి రియాక్ట్ అవుతూండడం వింతగా విచిత్రంగానూ ఉంటోంది. ప్రజా సమస్యల మీద ఒక రకమైన గొంతు వినిపిస్తే ఎవరికీ అభ్యంతరాలు అయితే ఉండవు.

కానీ ఒక్క పార్టీ విషయంలో ఒక రాజకీయ నేత విషయంలో ఇలా పోటీ పడుతున్నారా అన్న అనుమానాలు అయితే ఉన్నాహ్యి. ఆయనే చంద్రబాబు. చంద్రబాబు ఈ రోజుకీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఆయన విజనరీ అంటూ మోడీని కొనియాడారు. మరి ఆ సంగతి తెలిసి కూడా బాబు ఈజ్ గ్రేట్ అనేలా వామపక్షాలు అందునా సీపీఐ అయితే గట్టిగా మాట్లాడుతోంది.

నిజానికి అవినీతికి ఆమడదూరం ఉండే సీపీఐ వంటి పార్టీలు ఒక కుంభకోణం కేసులో బాబుని అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ పోలీసులు చెబుతూంటే బాబు అరెస్ట్ అక్రమం అని ఎలా అంటుంది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బాబు అరెస్ట్ అక్రమం దుర్మార్గం అని సీపీఐ రామక్రిష్ణ అంటున్నారు. పద్నాలుగేళ్ల పాటు సీఎం గా చేశారు, ఆయన పట్ల ఇలా పోలీసులు ప్రవరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే తీరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ ని బీజేపీ ఖండిస్తోంది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఏమైనా ఒక విషయంలో అదీ బాబు విషయంలో మాత్రం బీజేపీ లెఫ్ట్ పార్టీలు ఒక్క టోన్ తో ఉన్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

అప్పట్లో అంటే 1988 టైం లో నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి అన్న గారు బీజేపీ లెఫ్ట్ పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చారు. అది జాతి కోసం, దేశం కోసం ఆయన చేసిన పని. అంతా శభాష్ అన్నారు. ఇపుడు ఆయన అల్లుడు, మాజీ సీఎం చంద్రబాబు కూడా తనదైన రాజకీయ చాతుర్యంతో బీజేపీ లెఫ్ట్ పార్టీలను ఒక్కటిగా చేసి తన వైపునకు తిప్పుకున్నారని సెటైర్లు అయితే పడుతున్నాయి. ఇంతకీ బాబు హ్యాండ్ ఇవ్వబోయే పార్టీ ఏది అన్నదే అసలైన చర్చగా ఉంది. అపుడు బాబు మీద విమర్శలు ఎవరు ముందు చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.