Begin typing your search above and press return to search.

నడ్డాతో బాబు మంతనాలు... ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లెనా...?

ఇక రాష్ట్రపతిభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహుతులతో బాబు కూర్చున్నారు. ఆయన పక్క సీట్లోనే జేపీ నడ్డా ఉన్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:26 AM GMT
నడ్డాతో బాబు మంతనాలు... ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లెనా...?
X

చంద్రబాబునాయుడును అందుకే రాజకీయ చాణక్యుడు అని అంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏదో ఒకటి సక్సెస్ చూసుకుంటూనే ఉంటారు. నిజానికి చంద్రబాబు ఈసారి ఢిల్లీ టూర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అవుతారని, ఫ్యామిలీ అంతా ఒక్కటిగా కనిపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేస్తారని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి.

అయితే జూనియర్ ఢిల్లీలో జరిగిన ఎంటీయార్ బొమ్మతో వెండి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు దాంతో బాబు ఢిల్లీ టూర్ లో పొలిటికల్ మసాలా ఏమి ఉంటుందని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన ఇదే కార్యక్రమానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంతనాలు జరిపారని టాక్ స్ప్రెడ్ అవుతోంది.

ఇక రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహుతులతో బాబు కూర్చున్నారు. ఆయన పక్క సీట్లోనే జేపీ నడ్డా ఉన్నారు. ఒక వైపు మీటింగ్ అవుతూంటే బాబు నడ్డతో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. అయితే అది అంతటితో ఆగిపోలేదని మీటింగ్ అయిపోయిన తరువాత కూడా జేపీ నడ్డాతో బాబు మాట్లాడారని అంటున్నారు.

ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటు పురంధేశ్వరి కూడా ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యారని, అలా ఈ ముగ్గురూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని ప్రచారం అయితే ఢిల్లీ సర్కిల్స్ లో ఒక రేంజిలో సాగుతోంది. ఏపీలో పురంధేశ్వరి కూడా తాను ప్రెసిడెంట్ అయ్యాక టీడీపీని ఒక్క మాట అనకుండా మొత్తం వైసీపీ మీదనే విమర్శలు చేస్తున్నారు.

ఏపీలో టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు ఉంటాయా లేవా అన్నది పక్కన పెడితే ఏపీ బీజేపీ మాత్రం టీడీపీ పట్ల పాజిటివ్ కన్సర్న్ తో ఉందన్నట్లుగా పూంధేశ్వరి స్పీచెస్ ఉంటున్నాయని అంటున్నారు. ఇక జేపీ నడ్డతో గతంలో కూడా బాబు ఢిల్లీలో సమావేశం అయిన సందర్భం ఉంది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా ఈ ఇద్దరూ భేటీ అయ్యారు.

ఆ చర్చల వివరాలు ఏమిటో తెలియదు కానీ బీజేపీ ఎండీయే భేటీకి బాబుని పిలవలేదు. గ్యాప్ వచ్చింది అని అంతా అనుకున్నారు. ఈలోగా పురంధేశ్వరి నియామకం కావడంతో బీజేపీ టీడీపీ పొత్తుల ఆశలు సజీవంగానే ఉన్నాయని అంటున్నారు.

ఇపుడు ఎన్టీఆర్ పేరిట వెండి నాణెం ఆవిష్కరణకు వచ్చిన జేపీ నడ్డతో మంతనాలు జరిపి ఈ మీటింగ్ కి బాబు బాగా ఉపయోగించుకున్నారు అని అంటున్నారు. ఇక జేపీ నడ్డా వరకూ చూస్తే ఏపీలో ఆయన ఒకటి రెండు సార్లు పర్యటించారు. ఆయన సైతం టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీదనే విమర్శలు గుప్పించారు. ఆ విధంగా చూస్తే నడ్డాకు టీడీపీతో మైత్రి ఇష్టమే అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు.

ఆయనతో బాబు ఏమి మాట్లాడారు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. మరి ఆ సందేశాన్ని నడ్డా బీజేపీ పెద్దలు అయిన నరేంద్ర మోడీ, అమిత్ షాల దృష్టికి తీసుకుని వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పొత్తుల విషయం మీద అడుగులు ముందుకు వేస్తుందని అంటున్నారు. మరి చంద్రబాబు సైతం ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అలాగే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కూడా సానుకూలంగా ఉన్నారు అని అంటున్నారు ఇలా చూస్తే కనుక వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.