యువ నేతలకు శిక్షణ.. టీడీపీలో మీకూ అవకాశం..!
పార్టీ తరఫున ఒక్కొక్క నియోజకవర్గంనుంచి 45-50 మంది యువకులను ఎంపిక చేసి.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి తీసుకువస్తున్నారు.
By: Tupaki Desk | 17 May 2025 5:57 PM ISTటీడీపీలో కొత్త రక్తాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా యువతరాన్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. నియో జకవర్గాల వారీగా యువతను ఎంపిక చేసి వారికి పార్టీపై అవగాహన కల్పించడంతోపాటు.. పార్టీ కార్యక్ర మాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారన్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట.
ఏంటి వ్యూహం?
పార్టీలో ఇప్పటి వరకు ఉన్న నాయకులను చూస్తే.. చాలా వరకు 55+ వయసున్న వారే కనిపిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారిని ఆకర్షించేలా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. యువ ఓట్లను ఆకర్షించేందుకు.. యువతను రంగంలోకి దింపడం ద్వారా.. పనిని సులువు చేసుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. ఈ దిశగానే యువతను ఎంపిక చేస్తున్నారు.
ఏంటీ శిక్షణ..?
పార్టీ తరఫున ఒక్కొక్క నియోజకవర్గంనుంచి 45-50 మంది యువకులను ఎంపిక చేసి.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి తీసుకువస్తున్నారు. వారికి వారం రోజుల పాటు పార్టీ పరిస్థితిపై అవగాహన కల్పిస్తు న్నారు. పార్టీ హిస్టరీ.. భవిష్యత్తు.. పార్టీకి సానుకూలంగా ఉన్న రంగాలు, ఓటు బ్యాంకు.. ప్రజాపాలన.. ఓటర్ల నాడిని పట్టుకోవడం.. ఫ్యూచర్‌లో ఎలా ఎదగాలన్న విషయంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రజల ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిన తీరుపై వారిని మలుస్తున్నారు.
ఎవరు అర్హులు?
టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువ శిక్షణకు 20 ఏళ్లు నిండిన వారిని అర్హులుగా పేర్కొంటున్నా రు. వారు పార్టీకి ఇప్పటి వరకు కార్యకర్తలుగా ఉన్నా.. లేకున్నా.. అర్హులుగానే పరిగణిస్తున్నారు. అదేసమ యంలో గ్రామీణస్థాయిలో అయితే.. కనీసం పదోత రగతి చదవిన వారిని ఎంపిక చేస్తున్నారు. పట్టణ స్థాయిలో కనీసం ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారిని.. ఎంపిక చేస్తున్నారు. సొంత వ్యాపారాలు ఉన్నవా రిని ఎక్కువగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంట్రస్ట్ ఉన్నవారు.. నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీసులో లేదా.. నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీసులో పేరు నమోదు చేసుకుంటే.. శిక్షణ ఇచ్చేందుకు పిలుస్తారు.
