'ఆశావహుల'.. రుసరుస.. వాట్ నెక్ట్స్.. ?
కానీ, ఈ తరహా అసంతృప్తి కారణంగా.. క్షేత్రస్థాయిలో టీడీపీ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
By: Garuda Media | 7 Jun 2026 11:44 AM ISTప్రస్తుతం జరిగిన రాజ్యసభ సీట్ల కేటాయింపుపై చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు.. ఇలా చాలా మంది ఉన్నారు. అయితే.. వీరిలో ఒక్కరికి కూడా అవకాశం రాలేదు. ఇదే ఇప్పుడు సదరు నేతలకు ఇబ్బందిగా మారింది. అలాగని పార్టీని వదిలి పెట్టి పోయే పరిస్థితిలేదు. ఆల్టర్ నేట్ రాజకీయాలు చేసేందుకు కూడా అవకాశం లేదు.
కానీ, ఈ తరహా అసంతృప్తి కారణంగా.. క్షేత్రస్థాయిలో టీడీపీ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోవాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు.. సీనియర్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పదవులు ఇచ్చారా? ఇవ్వలేదా? అనేది పక్కన పెడితే.. వారిలో అసంతృప్తి పెరగకుండా చూడాలి. దేవినేని ఉమా.. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఆయనకు పదవిపై హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పటి వరకు ఏ చిన్న పదవిని కూడా ఇవ్వలేదు. ఆయన పంటిబిగువున బాధను భరిస్తున్నారన్నది వాస్తవం. ఇది.. మైలవరం నియోజవర్గంలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేవినేనికి కమ్మ సామాజిక వర్గంలో బలమైన కేడర్ ఉంది. ఆయనకు పదవి ఇవ్వకపోవడం.. ఇప్పుడు వారు కూడా పార్టీపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఇక, వర్ల రామయ్యకు మాదిగ సామాజిక వర్గంలో పట్టుంది. ఆయన కుమారుడు పామర్రు ఎమ్మెల్యేగాఉన్నారు.
అయితే.. గతంలో అవకాశం లేనప్పుడే.. వర్లను రాజ్యసభకు పోటీగా పెట్టారు. ఆయన ఓడిపోయారు. అనం తరం.. ఆయనకు పార్టీలో అవకాశం ఇచ్చినా.. పదవి విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇది అంత ర్గతంగామాదిగలను పార్టీకి దూరం చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు యనమల రామకృష్ణుడు పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఆయన నేరుగా తనకు రాజ్యసభలో అడుగు పెట్టాలని ఉందని.. చెప్పారు. కానీ, ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పోనీ.. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవ్వలేక పోవచ్చు. కానీ.. వారితో చర్చించి.. శాంత పరిచేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నం చేయకపోవడం మరింత ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. ఈ పరిణామాలే ప్రభుత్వానికి, పార్టీకి కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
