ఈ సారి మహానాడు హాటే గురూ.. !
టీడీపీకి కీలకమైన మహానాడు.. వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ దఫా.. ఇది అంత తేలికగానో.. లేక పైపైనో ఉండే విధంగా లేదు.
By: Tupaki Desk | 24 April 2025 2:00 PM ISTటీడీపీకి కీలకమైన మహానాడు.. వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ దఫా.. ఇది అంత తేలికగానో.. లేక పైపైనో ఉండే విధంగా లేదు. చాలా లోతైన నిర్ణయాలు.. అంత కు మించి లోతైన చర్చలు.. దిశగా మహానాడు ఉంటుందని అంటున్నారు. గత మహానాడులో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని సంకల్పించారు. అప్పటి పరిస్థితి అది! వైసీపీ దూకుడు.. కేసులు కారణంగా.. పార్టీ వ్యవస్థలు దెబ్బతినే వ్యవహారాలు ఆనాడు టీడీపీకి ఇబ్బందిగా మారాయి. దీంతో ఏకైక లక్ష్యంగా అధికారాన్ని ఎంచుకున్నారు.
కానీ, వచ్చే నెలలో జరగనున్న మహానాడులో హాట్ హాట్ అంశాలకు తోడు.. భవిష్యత్ ప్రణాళికలు కూడా.. ఉండనున్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. `ఇది మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. మానాయకుడి ఆలోచనను బట్టి చూస్తే.. చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఎలానూ అధికారంలోనే ఉన్నాం కాబట్టి.. భవిష్యత్తు ఇప్పుడు చాలా ముఖ్యంగా పార్టీ పరంగా.. ప్రభుత్వం పరంగా.. ఎలా ముందుకు సాగాలన్నది నిర్ణయించి.. చర్చిస్తాం` అని తూర్పుగోదావరికి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు.
ఇక, తొలిసారి కడపలో నిర్వహిస్తున్న ఈ మహానాడులో.. పార్టీ నిర్మాణం.. సహా.. నాయకత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికిప్పుడు నాయకత్వ మార్పు ఉండకపోవచ్చని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కానీ, పార్టీలో ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ స్థానాన్ని మరింత మెరుగు పరిచి.. కీలక నేతగా ఆయనను ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేసమయంలో కూటమిగానే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న దరిమిలా.. నాయకుల తీరును మరింత లోతుగా విశ్లేషించనున్నారు.
కీచు లాటలు.. కుమ్ములాటలు పెరిగిపోయిన దరిమిలా.. ఇలాంటి వారిని చంద్రబాబు గట్టిగానే మందలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే సారికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటే సరే.. లేకపోతే.. మరోసారి త్యాగాలు తప్పవు. పైగా.. వచ్చే ఎన్నికల నాటికి అమరావతి కూడా ... దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారం విషయంలో రాజీ పడని విధంగా ముందుకు సాగాలన్నది చంద్రబాబు లక్ష్యం. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. ఈ దపా మహానాడు హాటే అని అంటున్నారు.
