Begin typing your search above and press return to search.

'ఇంటింటికీ కూట‌మి' వాయిదా.. రీజ‌నిదే!

ఈ నెల 25(గురువారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన `ఇంటింటికీ కూట‌మి ప్ర‌భుత్వం ` కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.

By:  Garuda Media   |   24 Jun 2026 7:00 PM IST
ఇంటింటికీ కూట‌మి వాయిదా.. రీజ‌నిదే!
X

ఈ నెల 25(గురువారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన 'ఇంటింటికీ కూట‌మి ప్ర‌భుత్వం ' కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. గ‌త నెల‌లోనే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి టీడీపీ అధినేత నాయ‌కు లు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు తెచ్చిన పెట్టుబ డులు, క‌ల్పించిన ఉద్యోగాలు, ఉపాధి, ప్రాజ‌క్టులు ఇలా అన్ని అంశాల‌పైనా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు. ఈ నెల 25నుంచి 45 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

దీనికి సంబంధించి `మై టీడీపీ యాప్‌` ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ దీనిలో భాగ‌స్వాము లు కావాల‌న్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌డంతోపాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు స‌మ‌గ్రంగా వివ‌రించాల‌న్న ల‌క్ష్యంతో ఇంటింటికీ కూట‌మి ప్ర‌భుత్వం పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీనిలో మూడు పార్టీల నాయ‌కులు కూడా పాల్గొనాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించా రు. క్షేత్ర‌స్థాయిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి.

అయితే.. అనూహ్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స‌మ‌గ్ర ఓట‌ర్ల ప్ర‌క్షాళ‌న‌(స‌ర్‌) ప్రక్రియ రాష్ట్రంలో జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు ఇంటింటికీ కార్య‌క్ర‌మం చేప‌డితే.. ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. ముఖ్యంగా స‌ర్ ప్ర‌క్రియ‌ను ప‌ర్యవేక్షిస్తున్న టీడీపీ నాయ‌కులు దీనిని ప‌క్క‌న పెట్టి పార్టీకార్య‌క్ర‌మంలో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ఇంటింటికీ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసిన‌ట్టు పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌టించింది.

ఈ కార్య‌క్ర‌మాన్ని జూలై 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌టిలోగా స‌ర్ ప్ర‌క్రియ‌పైనే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు దృష్టి పెట్టాల‌ని సూచించారు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. ఓట‌ర్ల‌కు ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వారి వివ‌రాల‌ను న‌మోదు చేసుకుంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌లో టీడీపీ ఓట్లు గ‌ల్లంతు కాకుండా చూసే బాధ్య‌త‌ను ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు అప్ప‌గించారు.