వారికి వన్ టైం సెటిల్మెంట్...టీడీపీలో చర్చ ?
తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన పార్టీ. ఆ పార్టీ నుంచి గెలిచిన వారు లోక్ సభ స్పీకర్ స్థాయి దాకా వెళ్లారు, అలాగే ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.
By: Satya P | 2 July 2026 5:00 PM ISTతెలుగుదేశం పార్టీ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన పార్టీ. ఆ పార్టీ నుంచి గెలిచిన వారు లోక్ సభ స్పీకర్ స్థాయి దాకా వెళ్లారు, అలాగే ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. గవర్నర్లు కేంద్ర మంత్రులు అయ్యారు. దేశంలో వేరే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత పొలిటికల్ హిస్టరీ ఈ విషయంలో టీడీపీకి ఉంది. అయితే పార్టీ ఇచ్చిన అవకాశాలు చాలా మంది సద్వినియోగం చేసుకుంటే కొందరు మాత్రం తమకు తోచిన ధోరణిలో పోతున్నారు. ఇక 2024 లో టీడీపీ టికెట్లలో అధిక శాతం యువతకు కొత్తవారికి ఇచ్చింది. సర్పంచుల నుంచి నేరుగా ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. అలాగే పార్టీ పదవులు చేపడుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయిన వారు ఉన్నారు. వీరిలో విషయం తెలిసిన వారు మళ్లీ మళ్లీ గెలవాలని అనుకునే వారు తపన పడుతున్నారు. జనంతో పార్టీ జనంతో మమేకం అవుతున్నారు. అయితే వచ్చిన పదవిని అధికారాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న వారు మాత్రం తమదైన శైలిలో పని చేస్తున్నారు. వీరి విషయంలో అధినాయకత్వం ఎన్ని సార్లు క్లాస్ తీసుకున్నా వ్యవహారం మాత్రం చక్కబడడం లేదని అంటున్నారు.
పనితీరు మదింపు :
ఇదిలా ఉంటే రెండేళ్ల కూటమి పాలన పూర్తి అయింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేల పనితీరుని అయితే అధినాయకత్వం చాలా జాగ్రత్తగా మదింపు చేస్తోంది అని అంటున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎంత ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యేల స్పందన ఎలా ఉంది. ప్రజలతో వారికి ఉన్న కనెక్షన్, పార్టీ క్యాడర్ తో మసలుతున్న వైనం ఇవన్నీ కూడా హైకమాండ్ చాలా నిశితంగా పరిశీలన చేస్తోంది అని అంటున్నారు. ఈ విషయంలో అయితే టెలి కాన్ఫరెన్సులు పెట్టి సమావేశాలు వర్చువల్ గానూ నేరుగానూ పెట్టి చేసిన దిశా నిర్దేశాల మేరకు ఎంత మంది పనిచేస్తున్నారు ఎంత మంది దారిలోకి వచ్చారు, మరెంత మంది ఇంకా మార్పు తెచ్చుకోలేక అలాగే ఉన్నారు అన్నది కూడా పార్టీ చాలా క్లోజ్ గా మోనిటరింగ్ చేస్తోంది అని అంటున్నారు.
వారితోనే ఇబ్బంది :
ఇక చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా దారిలోకి రాలేదని అంటున్నారు. పలు రకాలైన నివేదికలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సమాచారం, నిఘా వర్గాల నుంచి వచ్చిన భోగట్టాలు అన్నీ కూలంకషంగా తరచి చూసిన మీదట పార్టీ ఇప్పటిదాకా చేసిన హెచ్చరికలు చాలు అనుకుంటోంది అని అంటున్నారు. ఎంతగా అప్రమత్తం చేసినా కూడా పట్టించుకోని వారి విషయంలో ఇక కఠినంగా ఉండాల్సిందే అన్నది హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇక వారిని అలా చూసీ చూడనట్లుగా వదిలేయాలని కొత్త నాయకత్వం ఆయా సీట్లలో ప్రోత్సహించాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో :
ఇక సామాజిక పెన్షన్లు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇస్తోంది. నెలకు నాలుగు వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు, అలాగే దివ్యాంగుల పెన్షన్ ఇతర కేటగిరీలలో చూస్తే పదిహేను వేల దాకా పెన్షన్ ఇస్తున్నారు. మరి వీటిని జనాలకు అందచేసే కార్యక్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు అయితే జనంలోకి రాకపోవడం పట్ల అయితే హైకామండ్ ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలలో ఉదాశీనత కొందరిలో ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వం చేసే అభివృద్ధి గురించి జనంలో ప్రచారం చేయకుండా సొంత పనుల్లో బిజీగా ఉండేవారి లెక్కను వన్ టైం తోనే సెటిల్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆల్టర్నేషన్ లీడర్ షిప్ ని అక్కడ డెవలప్ చేసి ఈ తరహా నిర్లక్ష్యం చేస్తున్న వారికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా గోదావరి కోస్తా రాయలసీమల్లో సమానంగానే ఈ వన్ టైం ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
