Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఒకే కానీ ఎమ్మెల్యేల మీదనే పెద్ద డౌట్!

చంద్రబాబుకు విజనరీ అని పాలనాదక్షుడు అని పేరుంది. దాంతో బాబు మీద జనాలలో చూస్తే పెద్దగా మైనస్ పాయింట్లు ఏమీ కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 4:30 PM
చంద్రబాబు ఒకే కానీ ఎమ్మెల్యేల మీదనే పెద్ద డౌట్!
X

ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసింది. అంటే మొత్తం అధికారంలో ఇరవై శాతం ఖర్చు అయింది అన్న మాట. ఇంకా నాలుగేళ్ళు చేతిలో ఉంది కదా అని నిబ్బరం పడడం మంచిది కాదనే అంటున్నారు ఎందుకంటే చివరి రెండేళ్లూ ఎంత చేసినా యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతూనే ఉంటుంది. పైగా ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. సో చేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఈ రెండేళ్ళలోనే.

అంటే రానున్న రోజులలోనే అన్నీ సర్దుకోవాలి. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దారుణం అని అంటున్నారు. అదెలా అంటే చంద్రబాబు విషయంలో కాదు, ఆయన అనుభవానికి ఏలుబడికి జనాల నుంచి పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. కానీ అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు మీద మాత్రం అపుడే రావాల్సిన దాని కంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చేసింది అని అంటున్నారు. దాంతో కూటమిలో అతి పెద్ద డౌట్లు మొదలైపోయాయని అంటున్నారు.

చంద్రబాబుకు విజనరీ అని పాలనాదక్షుడు అని పేరుంది. దాంతో బాబు మీద జనాలలో చూస్తే పెద్దగా మైనస్ పాయింట్లు ఏమీ కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్యేల మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల చేస్తున్న సర్వేలు చూస్తే బాబు మీద అయితే పెద్దగా నెగిటివిటీ అయితే లేదనే అంటున్నారు.

ఇక కూటమి ఎమ్మెల్యేల పనితీరే దారుణంగా తయారు అయింది అని అంటున్నారు. వారు అవినీతికి హద్దూ పద్దూ లేకుండా పోతోందని ఫుల్ గా ఫోకస్ పెట్టి మరీ అక్రమ సంపాదనతో మునిగితేలుతున్నారని గ్రౌండ్ లో రిపోర్టులు చెబుతున్నాయని అంటున్నారు.

ఈ సంపాదనలో కూడా చాలా లెక్కలు ఉన్నాయని అంటున్నారు. జిల్లాను బట్టి ఈ అవినీతి కధలు లెక్కలూ చాలా మారిపోతున్నాయని చెబుతున్నారు ఆయా జిల్లాలలో ఉన్న ప్రకృతి వనరులు అవకాశాలు సదుపాయాలు అన్నీ కలసి అవినీతి గ్రాఫ్ ని నిర్ణయిస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా ప్రకృతి వనరుల దోపిడీని యధేచ్చగా చేస్తూ అవినీతికి చాలా మంది ఎమ్మెల్యేలు తెగబడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక ప్రతీ నియోజకవర్గంలో ఒక్కో స్టోరీ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల గురించి ఎవరిని అడిగినా అవినీతికి వారు ఎంచుకుంటున్న కొత్త మార్గాలను గురించి వివరిస్తున్నారుట. అంతే కాదు ఏ విధంగా అవినీతి చేయవచ్చో కూడా పరిశోధనలు చేస్తూ అందులో మాస్టర్ డిగ్రీలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇలా కాదేదీ వసూళ్ళకు అనర్హం అన్న తీరున పెద్ద ఎత్తున దందాలకు గ్రౌండ్ లెవెల్ లో పాల్పడుతూ అవినీతిని పారిస్తూంటే కూటమి పాలన పట్ల జనంలోనూ వివిధ వర్గాలలోనూ వ్యతిరేకత అయితే పెద్ద ఎత్తున పెరిగిపోతోంది అని అంటున్నారు. అయితే చంద్రబాబు పట్ల మాత్రం పాజిటివ్ గా జనాలు రియాక్ట్ అవుతూండడం గొప్ప ఊరటగా చెబుతున్నారు.

ఆయన ఏడున్నర పదుల వయసులో కష్టపడడం అయితే జనాలలో సానుకూలతను పెంచుతోంది. ఏపీని బాగు చేద్దామన్న బాబు తపనను జనాలు సరిగ్గానే అర్ధం చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇలా కూటమి పాలనలో ప్రభుత్వ పెద్ద మీద సానుకూలత ఉండి ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం వింత అయిన రాజకీయ పరిస్థితి అని అంటున్నారు.

దానిని కారణం ఏమిటి అంటే చంద్రబాబు తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయన క్రమశిక్షణగానే ఉంటున్నారు. అందరూ అలాగే ఉండాలని పదే పదే సూచిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో అవినీతికి తెగబడుతున్న పలువురు ఎమ్మెల్యేల విషయంలో బాబు ఏమీ చేయలేకపోతున్నారా అన్న చర్చ సాగుతోంది. బాబుకు ఎమ్మెల్యేల మీద పట్టు లేకుండా పోయిందా అన్న డౌట్లూ వస్తున్నాయట.

తాను సీరియస్ గానే అన్నీ చూస్తానని మారాలని ఎమ్మెల్యేలను బాబు హెచ్చరిస్తూనా ఎవరూ పట్టించుకోక పోవడం ఇపుడు ఆశ్చర్యం కలిగిస్తోంది అని అంటున్నారు. ఇక అధికారంలోకి వచ్చి కేవలం ఏడాది మాత్రమే అయింది కాబట్టి గబుక్కున ఎమ్మెల్యేల మీద ఏ రకమైన కఠిమైన చర్యలను తీసుకోలేరు అని అంటున్నారు.

ఒకవేళ సీరియస్ గా రియాక్ట్ అయితే వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలనే సాకుగా చేసుకుని చాలా మంది అవినీతికి తెగబడుతున్నారని అంటున్నారు. కనీసం అవినీతికి చేసిన కొందరిని అయినా సస్పెండ్ చేస్తే కనుక అంతా దారికి వస్తారు అని అంటున్నారు.

ఎందుకంటే కూటమికి అతి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అవినీతి చీడలు పీడలు ఉన్న ఒకరిద్దరిని బయటకు పంపించినా ఏమీ కొంప మునగదు. ప్రభుత్వానికి కూడా ఏమీ కాదు. అయితే రాజకీయంగా కొంత రిస్క్ ఉంటుంది. మరి తెగించి అయినా చంద్రబాబు ఈ రకమైన యాక్షన్ కి దిగితేనే అంతా గాడిన పడతారు అని కూటమి పట్ల కూడా జనంలో అనుకూలత పెరుగుతుందని అంటున్నారు. మరి కూటమి పెద్దలు ఏమి ఆలోచిస్తారో చూడాల్సి ఉంది మరి.