పది నెలలలో వైసీపీ గ్రాఫ్ ఎంత ?
ఏపీలో అధికార కూటమికి పవర్ దక్కి అక్షరాల పది నెలలు నిండింది. ఈ పది నెలలలో ప్రభుత్వం తన ప్రాధాన్యతలు చెబుతోంది.
By: Tupaki Desk | 17 April 2025 5:04 AMఏపీలో అధికార కూటమికి పవర్ దక్కి అక్షరాల పది నెలలు నిండింది. ఈ పది నెలలలో ప్రభుత్వం తన ప్రాధాన్యతలు చెబుతోంది. చేయాల్సినవి చేస్తోంది సరే సూపర్ సిక్స్ హామీల సంగతి ఏమిటి అంటే వాటికీ ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకున్నట్లుగా ఉంది. ముందు అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.
ఇక సంక్షేమ పధకాలు అమలు జరగడం లేదని అసంతృప్తి జనాల్లో ఉందని ప్రచారం సాగుతోంది. అయితే అది ఏ మోతాదులో ఉందో తెలియదు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీలో నియోజకవర్గాల స్థాయిలో కొందరు నేతల జోరు ఎక్కువగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మూడు పార్టీలు కూటమిలో ఉండడంతో ఆధిపత్యం పోరు ఉంది. అలాగే పేచీలూ కొన్ని చోట్ల ఉన్నాయి.
మంత్రులుగా కొత్తవారు ఎక్కువ మంది కావడంతో పాలన ఇంకా గాడిలో పడలేదని కూడా ఉంది. అయితే అవన్నీ కూడా కాలక్రమంలో సర్దుబాటు చేసుకోవడానికి కూటమి పెద్దలు చూస్తున్నారు. ఇదిలా ఉంటే పది నెలల కాలంలోనే టీడీపీ కూటమి మీద జనంలో అసంతృప్తి పెరిగిపోయిందని ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పదని కూడా సర్వేలు వస్తున్నాయి. అవి ఫేక్ సర్వేలు అని ప్రత్యర్థి పార్టీ తయారు చేయించి సోషల్ మీడియాలో వండి వారుస్తోంది అని కూటమి నేతలు అంటున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం పట్ల తక్కువలో తక్కువ అసంతృప్తి అయితే ఉంది అని తటస్థ సర్వేలు చెబుతున్నాయి. అవి ప్రమాదకరం అయితే కావు సర్దుబాటు చేసుకోగలిగేవే అని అంటున్నారు. అదే సమయంలో కూటమికి జనాదరణ తగ్గిపోయి వైసీపీకి రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉందా అంటే లేదు అనే అంటున్నారు
ఎందుకంటే గడచిన పది నెలలలో వైసీపీ ఎక్కడా గట్టిగా నిలిచింది లేదని అంటున్నారు. వైసీపీలో భారీ ఓటమి తరువాత ఒక్కసారిగా నిర్వేదం ఆవరించింది అని అంటున్నారు. అధినాయకుడి నుంచి దిగువ స్థాయి క్యాడర్ వరకూ నైరాశ్యంలోకి వెళ్లిపోయారు అని అంటున్నారు. ఇక చూస్తే పార్టీ పెద్దగా ఆందోళనలు నిర్వహించినది లేదు అని చెబుతున్నారు. అధినాయకత్వం కూడా జనంలోకి పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు.
పార్టీకి కమిటీలు వేసింది. అలాగే బాధ్యతలు అప్పగించింది. కానీ నాయకులు మాత్రం ఇళ్ళ నుంచి బయటకు కాలు మోపడం లేదు. దాంతో ఏడాది నిండా కాకుండానే వైసీపీ రాజకీయ కార్యకలాపాలు అన్నీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పట్ల జనాలు మొగ్గు చూపుతున్నారా అంటే పెద్దగా లేదనే అంటున్నారు.
పధకాల లబ్దిదారుల విషయం తీసుకుంటే మాత్రం అప్పట్లో అలా ఇచ్చారు, ఇపుడు ఇవ్వడం లేదు అన్న చర్చ ఉంది. కానీ అది వైసీపీకి పాజిటివిటీని ఏ మేరకు తెచ్చి పెడుతుంది అన్నది అయితే కొలమానం లేదని అంటున్నారు వైసీపీ జనాల వద్దకు వెళ్ళి పార్టీని పటిష్టం చేసుకున్నట్లు అయితే ఎంతో కొంత మొగ్గు కనిపించేది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే నిండా ఏడాది కూడా కూటమి అధికారంలోకి వచ్చి కాలేదు. దాంతో కూటమి ప్రభుత్వం మీద జనాలలో ఆశలు బాగానే ఉన్నాయి. లేట్ అయినా ఇస్తారు అన్న నిబ్బరం కూడా ఉంది అని అంటున్నారు. దాంతో తొలి ఏడాదిలోనే భయంకరమైన అసంతృప్తి వచ్చేసి వైసీపీ పట్ల అది పాజిటివ్ వేవ్ గా మారేటంత సీన్ అయితే లేదని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఓటమి తరువాత అనూహ్యంగా వైసీపీ బలహీనపడింది అని అంటున్నారు. చాలా జిల్లాలలో సరైన నాయకులు లేకపోవడం గట్టి నాయకులు కూటమి వైపుగా జంప్ కావడం ఉన్న నాయకులు సైలెంట్ కావడంతో వైసీపీ పూర్తిగా సొంత ఇబ్బందులో ఉందని అంటున్నారు. దాంతో వైసీపీ ముందు తన ఇల్లు చక్కదిద్దుకుని బయటకు రావడానికి చాలా టైం పడుతుందని అంటున్నారు.
ఇక ఏ ప్రభుత్వం మీద అయినా తొలి మూడేళ్ళూ జనాలు పూర్తి విశ్వాసం కనబరుస్తారు. తప్పులు చేసినా దిద్దుకునే చాన్స్ ఇస్తారు. అప్పటికీ కుదరకపోతేనే వ్యతిరేకత వస్తుంది. అయితే ఆ వ్యతిరేకతను ఒడిసిపట్టి తామే ఆల్టర్నేషన్ అని నిరూపించుకునే గట్టి పార్టీ కూడా ఎదురుగా ఉండాలి.
ప్రస్తుతానికి అయితే ఓటమి బాధలోనే వైసీపీ ఇంకా ఉంది అని అంటున్నారు. వైసీపీ స్వీయ లోపాలు తప్పిదాల నుంచి బయటపడి అంతా చక్కదిద్దుకుంటే మూడేళ్ళ తరువాత రాజకీయం ఏమైనా టర్న్ అవుతుందేమో కానీ ఇప్పటికి అయితే ఏపీలో వైసీపీ పెద్దగా పుంజుకోలేదన్న విశ్లేషణలు వస్తున్నాయి.