టీడీపీ రాజ్యసభ రేసులో ఆమె ?
మహానాడులో టీడీపీ ఈ కీలక ప్రకటన చేసింది. దాంతో దీనిని మొదటిగా ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్న చర్చ కూడా మొదలైంది.
By: Satya P | 29 May 2026 1:51 AM ISTతెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల మహానాడులో హైలెట్ ఏంటి అంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ని సార్వత్రిక ఎన్నికల్లో కూడా అమలు చేస్తామని ప్రకటించడం. అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా మహిళలకు మూడవ వంతు టికెట్లు దక్కబోతున్నాయి అన్న మాట. ఇది నిజంగా టీడీపీలో మహిళా నేతలకు వెరీ గుడ్ న్యూస్. ఈ ప్రకటన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేస్తే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన మహిళలకు ముప్పై మూడు శాతం టికెట్లు ఇస్తామని చెప్పినపుడు యావత్తు టీడీపీ మహిళలు అంతా హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉన్నారు. ఇక వీరితో పాటు మరింత మంది కొత్తగా జత కాబోతున్నారు అని అంటున్నారు.
తొలి అవకాశం రెడీ :
మహానాడులో టీడీపీ ఈ కీలక ప్రకటన చేసింది. దాంతో దీనిని మొదటిగా ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్న చర్చ కూడా మొదలైంది. 2029 ఎన్నికలు అంటే మూడేళ్ళ సమయం ఉంది. అందుకే ఈ వేడి ప్రకటన అలా ఉండగానే వెంటనే మహిళలకు చాన్స్ ఇచ్చే ఎన్నికలు రాజ్యసభ రూపంలో వచ్చాయని అంటున్నారు. రాజ్యసభలో నాలుగు ఖాళీలు ఏపీలో ఏర్పడ్డాయి జూన్ 20 లోగా కొత్త ఎంపీలు ఎన్నిక అవుతారు. షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఇక ఈ నాలుగింటిలో మూడు టీడీపీ తీసుకుంటుంది అని అంటున్నారు. దాంతో ఈ మూడింట్లో మూడవ వంతు విమెన్ కోటా కింద మహిళలకు ఒకటి ఇస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది అని అంటున్నారు.
అన్ని సమీకరణలతోనే :
ఇక మూడు ఎంపీ సీట్లలో ఒకటి సానా సతీష్ ని రెన్యూల్ చేయడంతో పోతుంది. అలా గోదావరి జిల్లాలకు అవకాశం దక్కినట్లే అంటున్నారు మిగిలిన రెండులో ఒకటి రాయలసీమకు మరొకటి కోస్తాను అయినా లేదా ఉత్తరాంధ్రకు అయినా కేటాయిస్తారు అని అంటున్నారు. ఒక అందులో కూడా సామాజిక కోణం కూడా చూస్తారు అని తెలుస్తోంది. మరి ఈ లెక్కన టీడీపీ నుంచి విమెన్ కోటా తొలిగా అమలు చేస్తే ఆ జాక్ పాట్ ని కొట్టి రాజ్యసభకు వెళ్ళే లక్కీ చాంపియన్ ఎవరూ అన్న చర్చ కూడా సాగుతోంది.
వారికి అవకాశం :
టీడీపీ గతంలో కూడా ఎంతో మంది మహిళలకు రాజ్యసభ అవకాశం ఇచ్చింది. గోదావరి జిల్లాలకు చెందిన తోట సీతా మహాలక్ష్మికి అలాగే తెలంగాణాకు చెందిన గుండు సుధారాణికి రాజ్య సభ సీట్లు దక్కాయి. వీరితో పాటుగా అంతకు ముందు జయప్రద, రేణుకా చౌదరి వంటి వారు కూడా టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన వారి జాబితాలో ఉన్నారు. ఇటీవల సంవత్సరాలలో చూస్తే మహిళలకు రాజ్యసభ సీటు దక్కినది లేదు. దాంతో ఇపుడు ఆ లోటు తీరబోతోంది అని అంటున్నారు. మొత్తానికి మహానాడులో టీడీపీ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో లేడీస్ ఫస్ట్ అన్నట్లుగా ఎవరికి చాన్స్ దక్కుతుందో అన్నది చర్చగా ఉంది. ఆమె ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది అని అంటున్నారు.
