Begin typing your search above and press return to search.

సుజనా చౌదరి భారీ రిస్క్ చేస్తున్నారా...!?

ఇదిలా ఉంటే సుజనా టీడీపీ బీజేపీ పొత్తులో లోక్ సభకు విజయవాడ నుంచి పోటీ చేద్దామనుకున్నారు.

By:  Tupaki Desk   |   6 April 2024 12:30 AM GMT
సుజనా చౌదరి భారీ రిస్క్ చేస్తున్నారా...!?
X

ఒకనాడు టీడీపీలో చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీ లోకి వెళ్ళడం అప్పట్లో సంచలనం. అయితే ఆయన బీజేపీ లోకి వెళ్లినా టీడీపీని ఏమీ అనలేదు. ఆయన తన పాత సంబంధాలను బాగానే ఉండేలా చూసుకున్నారు. ఇదిలా ఉంటే సుజనా టీడీపీ బీజేపీ పొత్తులో లోక్ సభకు విజయవాడ నుంచి పోటీ చేద్దామనుకున్నారు.

కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయనకు విజయవాడ పశ్చిమ సీటు దక్కింది. ఇక్కడ నుంచి పోటీ చేయడం ద్వారా సుజనా చౌదరి భారీ రిస్క్ ఫేస్ చేస్తున్నారు అని అంటున్నారు. అసలే సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికలకు తొలిసారి. ఇక ఆయన ఉన్న బీజేపీ పశ్చిమలో వెరీ వీక్.

అలాంటిది ఆయన జనంతో పెద్దగా రిలేషన్స్ మెయింటెయిన్ చేయల్సిన అవసరం అయితే ఇప్పటిదాకా లేకుండా పోయింది. ఇక ఎంపీ అంటే వేరు. ఏడు అసెంబ్లీ సీట్లలో కొన్ని చోట్ల మెజారిటీ వచ్చినా గెలుపు సాధ్యం. కానీ ఎమ్మెల్యే అలా కాదు గ్రౌండ్ లెవెల్ దాకా ప్రచారం చేయాలి అందరితో పరిచయాలు ఉండాలి.

ఆ విధంగా చూస్తే సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ సీటు సవాల్ అని అంటున్నారు. ఇక ఈ సీటు కానీ ఇక్కడ జనాభా రాజకీయ సామాజిక నేపధ్యం కానీ చూస్తే కనుక ఈ సీటు కూటమి ఖాతాలో పడే అవకాశం ఎంత మేరకు ఉన్నాయన్నది ఒక విశ్లేషణ గా ఉంది.

విజయవాడ పశ్చిమలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. అలాగే కమ్యూనిస్టు ప్రభావితం అయిన ప్రాంతం.ఇక్కడ నుంచి టీడీపీ 1983లో ఒకే ఒక్కసారి గెలిచింది. ఆ తరువాత మళ్లీ గెలిచింది లేదు. ఇక కాంగ్రెస్ వామపక్షాలు అనేక సార్లు గెలిచాయి. వైసీపీ 2014, 2019లలో రెండు సార్లు గెలిచింది. దాంతో ఆ పార్టీకి పట్టుంది.

గతంలో వైసీపీ ముస్లిం కి ఒకసారి టికెట్ ఇచ్చింది. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం కూడా ఎక్కువ. దాంతో 2019లో ఆ సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ని వైసీపీ నిలబెట్టింది. అలా ఆయన గెలిచారు. మొత్తం మీద చూస్తే ఎక్కుమంది పేదలు బీసీలు మైనారిటీలు ఉండే సీటు ఇది.

ఇక్కడ బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నా ఆయన టీడీపీ అండ చూసుకునే పోటీలో ఉన్నారు. కానీ నలభయ్యేళ్లుగా టీడీపీ ఇక్క జేగంట మోగించినది లేదు. ఈ నేపధ్యంలో చూస్తే కనుక సుజనా భారీ రిస్క్ చేస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు విజయవాడ పశ్చిమలో కమ్మ సామాజిక వర్గం ఎపుడూ గెలిచిన దాఖలాలు లేవు. ఆ సామాజిక వర్గానికి చెందిన సుజనా ఇపుడు పోటీ చేయడం ద్వారా పెద్ద సాహసం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు ఉన్న బలం ఏంటి అంటే అంగబలం అర్ధబలం. జనసేన టీడీపీ అండతో గెలవాలని చూస్తున్నారు.

జనసేన నుంచి పోతిన మహేష్ ఈ సీటు ఆశించారు. కానీ ఆయనకు రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఆ పార్టీ సహకారం అనుమానమే అంటున్నారు. మొత్తం మీద అందరికీ కలుపుకుని పోటీ చేసినా మైనారిటీ అభ్యర్ధి వైసీపీ నుంచి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనను ఓడించడం అంటే కష్టమే అంటున్నారు. ఇక్కడ వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని నానికి కూడా బలం ఉంది. మొత్తం మీద చూస్తే తొలి ప్రయత్నంలోనే సుజనా సీటు ఎంపికలో తడబడ్డారా లేక గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారా అన్నది తెలియాలి అంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.