ఏంటి.. వైసీపీ అంత బాగా నచ్చిందా?!
తాజాగా బుధవారం జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోవడం అందరి నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
By: Tupaki Desk | 25 Jun 2025 6:12 PMసోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. ఏంటి.. వైసీపీ అంత బాగా నచ్చిందా? అంటూ.. నెటిజన్లుకామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు పార్టీ గ్రాఫ్ పడిపోయి.. కీలక నాయకులు లబోదిబోమంటున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా వైసీపీ అధినేత.. రప్పా.. రప్పా పాట పాడుకుంటున్నారు. చంపేస్తాం.. నరికేస్తాం.. అన్నవారిని సమర్థిస్తున్నారు. దీంతో మధ్యతరగతి వర్గాలు ఆ పార్టీకి కడు దూరంలో ఉన్నాయి. ఇక, ఇతర సంక్షేమ పథకాలు అందుకున్నవారు కూడా.. దూరమయ్యారు. కూటమి అందిస్తున్న సంక్షేమంతో సంతృప్తి పొందుతున్నారు.
ఎలా చూసుకున్నా.. వైసీపీకి ఇప్పుడు కనుచూపు మేరలో కూడా ఫ్యూచర్ కనిపించడం లేదు. అయినా.. తగుదునమ్మా.. అంటూ టీడీపీ మాజీ నాయకుడు ఒకరు వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఇటీవల పార్టీకి రిజైన్ చేసిన సుగవాసి బాలసుబ్రమ ణ్యం.. తాజాగా వైసీపీ చెంతకు చేరుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాకుచెందిన సుగవాసి పాలకొండ్రాయుడి కుమారుడే బాలసుబ్ర మణ్యం. అన్నట్టుగా ఈయన తమ్ముడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అంటే.. ఒకే కుటుంబంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారన్నమాట.
తాజాగా బుధవారం జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోవడం అందరి నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫ్యామిటీ నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. అందునా టీడీపీలోనే కొనసాగింది. రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల విషయంలో సుబ్రమణ్యం రగడకు దిగతున్నారు. దీనిపై పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. అయితే.. పార్టీ అధిష్టానం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. ప్రజల్లో ఉండాలని.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించింది.
కానీ, సుబ్రమణ్యం మాత్రం ప్రజలను వదిలేసి.. పార్టీపైనా.. ప్రభుత్వంపైనా విమర్శలు చేయడానికి పరిమితం అయ్యారు. ఒక దశలో ఐవీఆర్ ఎస్ సర్వే ద్వారా కూడా సుగవాసి గ్రాఫ్‌ను టీడీపీ అధినేత తెలుసుకున్నారు. అయితే.. ప్రజల్లో ఏమాత్రం పట్టు లేదని గ్రహించారు. దీంతో సుబ్రమణ్యాన్ని పక్కన పెట్టారు. ఈ విషయం గుర్తించి.. తననుతాను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసుకుని ఉంటే టీడీపీలోనే మంచిపోస్టు దక్కి ఉండేది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రప్పా రప్పా పార్టీలోకి వెళ్లారా? అంటూ.. నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ అంత నచ్చిందా? అని కూడా కామెంట్లు చేస్తున్నారు.