Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: స్కిల్ స్కాంలో ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇప్పుడు ఏపీలో ప్రతీ చోటా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయన్నా అతిశయోక్తి కాదు

By:  Tupaki Desk   |   28 Sep 2023 10:57 AM GMT
బిగ్ బ్రేకింగ్: స్కిల్ స్కాంలో ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

ఇప్పుడు ఏపీలో ప్రతీ చోటా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయన్నా అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఈ స్కాం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 19 రోజులుగా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... స్కిల్ స్కాం కు సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ఈ పిటిషన్ పై విచారణ వచ్చేనెల 3వ తేదీన జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ సర్కార్ ఎంటరైంది.

తనపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును కొట్టివేయాలని చంద్రబాబు ఈ పిటిషన్ ద్వారా కోర్టును కోరిన నేపథ్యంలో... సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా... చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

ఇదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయని, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా... నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌ క్యాష్‌ చేసుకున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.

ఇదే క్రమంలో... ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కూడా కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖే అనే విషయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం... ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం అని సుప్రీంకోర్టును కోరింది.