Begin typing your search above and press return to search.

కరెంట్ వైర్లు తగిలి వృద్ధురాలు సజీవదహనం.. వణికిస్తోన్న వీడియో!

80ఏళ్ల వృద్ధురాలు పొరపాటున ఇంటి బాల్కనీలో హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. అంతే.. అక్కడికక్కడే ఆమె సజీవ దహనం అయింది. ఆ సమయంలో వృద్ధురాలు మంటల్లో కాలిపోతుండగా స్థానికులు వీడియో తీశారు.

By:  Tupaki Desk   |   30 July 2023 6:05 AM GMT
కరెంట్ వైర్లు తగిలి వృద్ధురాలు సజీవదహనం.. వణికిస్తోన్న వీడియో!
X

80ఏళ్ల వృద్ధురాలు పొరపాటున ఇంటి బాల్కనీలో హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. అంతే.. అక్కడికక్కడే ఆమె సజీవ దహనం అయింది. ఆ సమయంలో వృద్ధురాలు మంటల్లో కాలిపోతుండగా స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటు.. వణుకుపుట్టించేలా ఉందనే కామెంట్లను సొంతం చేసుకుంటోంది.

అవును... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తగిలి ఓ వృద్ధురాలు సజీవ దనహనమైంది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు, స్థానికులు మండిపడుతున్నారు.. పోలీస్ స్టే షన్ ముందు బైఠాయించారు.

వివరాళ్లోకి వెళ్తే... ఒక 80ఏళ్ల వృద్ధురాలు తన ఇంటి బాల్కనీలో నిల్చుని ఉంది. ఆ బాల్కనీలో నిలబడి తన మనవడికి ఫోన్ చేసే ప్రయత్నంలో ఉంది. ఆ సమయంలో అప్రయత్నంగా పొరపాటున విద్యుత్ వైర్ ను తాకింది. దీంతో... ఆ ఇంటి బాల్కనీమీదుగా వెళ్తోన్న ఆ 11వేల వోల్టుల హైటెన్షన్ కరెంట్ వైర్ దాటికి ఒక్కసారిగా షాక్ కి గురైంది.

అనంతరం మంటలు చెలరేగాయి.. ఆమె శరీరం మంటలతో నిండిపోవడం ప్రారంభమైంది.. అనంతరం వృద్ధురాలు సజీవ దహనం అవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.కాగా... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

హైటెన్షన్ విద్యుత్ వైర్లు చాలా ప్రమాదకరం అని తెలిసినా కూడా.. ఇంటి ముందు చేతికి అందేలా వైర్లను ఉంచడం క్షమించరాని నేరం అని అంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచిచుస్తున్నారు. ఇప్పటికైనా ఇళ్ల నుంచి దూరంగా విద్యుత్ వైర్లను జరపాలని డిమాండ్ చేస్తున్నారు.