Begin typing your search above and press return to search.

ఎస్ ఏ ఏస్ గ్రూప్ సర్వే : తెలంగాణాలో కీలక వర్గాలు ఎటు వైపు....?

ఈ సర్వేలో రైతులను, లీజు రైతులను ఒక కేటగిరీగా తీసుకున్నారు. అలాగే విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులను పలు కేటగిరీలుగా ఉంచారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:41 AM GMT
ఎస్ ఏ ఏస్ గ్రూప్ సర్వే : తెలంగాణాలో కీలక వర్గాలు ఎటు వైపు....?
X

తెలంగాణాలో కీలక వర్గాల మద్దతు ఎవరికి ఉంది, ఎటు వైపు ఆ మద్దతు ఉంది అన్నది చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంది. శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఈ వివరాలను చెప్పుకొచ్చింది. సామాజిక వర్గాల వారీగా వృత్తుల వారీగా వయసుల వారీగా కూడా విభజిస్తూ ఆయా వర్గాల మద్దతు ఎవరికి ఎంత వరకూ ఉందని లోతైన విశ్లేషణ చేసింది.

ఈ సర్వేలో రైతులను, లీజు రైతులను ఒక కేటగిరీగా తీసుకున్నారు. అలాగే విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులను పలు కేటగిరీలుగా ఉంచారు. చిన్న తరహా వ్యాపారులు, దినసరి కూలీలు, గృహిణులు, ఆర్టీసీ ఎంపాలీస్ అండ్ ఆటో డ్రైవర్స్, అంగన్ వాడీ ఆశా, డ్వాక్రా వర్కర్స్, ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారిని వివిధ కేటగిరీలుగా సర్వేలో చూపించారు.

ఇక 18 నుంచి 30 లోపు వయసు వారిని ఒక కేటగిరీగా, 31 నుంచి 40 దాకా మరో కేటగిరీగా, 41 నుంచి 50 ఇంకో కేటగిరీగా, 51 నుంచి 60 దాకా మరో కేటగిరీగా, 61 వయసు దాటిన వారిని మరో కేటగిరీగా పేర్కొన్నారు

అలాగే ఆర్ధిక పరిస్థితులను కేటగిరీగా చూస్తే ధనవంతులు, మధ్య తరగతి, పేదలు, నిరు పేదలుగా విభజించారు. ఇలా కేటగిరీలో చూస్తే కొన్ని చోట్ల బీయారెస్ కి ఎక్కువ మొగ్గు మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు కనిపిస్తోదంది. ఇలా అన్ని వర్గాలలో ఆయా పార్టీలకు మద్దతు లభించినట్లుగా సర్వే పేర్కొంది.

ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే 18 నుంచి 30 ఏళ్ళ లోపు వారిలో బీయారెస్ కి 38 శాతం మద్దతు దక్కితే కాంగ్రెస్ కి 40 శాతం మద్దతు లభించింది. బీజేపీకి 18 శాతం, ఇతరులకు నాలుగు శాతం మద్దతు లభించింది. 31 నుంచి 40 ఏజ్ గ్రూప్ కేటగిరీ తీసుకుంటే బీయారెస్ కి 40 శాతం మద్దతు లభిస్తే కాంగ్రెస్ కి 41 శాతం మద్దతు, బీజేపీకి 11 శాతం మద్దతు దక్కింది. ఇతరులకు ఎనిమిది శాతం మద్దతు దక్కింది.

అలాగే 41 నుంచి 50 ఏజ్ కేటగిరీలో చూస్తే బీయారెస్ కి 48 శాతం మద్దతు, కాంగ్రెస్ కి 38 శాతం, బీజేపీకి 12 శాతం ఇతరులకు రెండు శాతం మద్దతు లభించింది. 51 నుంచి 60 ఏజ్ కేటగిరీలో చూస్తే బీయారెస్ కి 50 శాతం, కాంగ్రెస్ కి 39 శాతం, బీజేపీకి ఏడు శాతం, ఇతరులకు నాలుగు శాతం మద్దతు లభించింది

ఇక 61 ఏళ్ళు దాటిన కేటగిరీలో చూస్తే బీయారెస్ కి 51 శాతం, కాంగ్రెస్ కి 40 శాతం, బీజేపీకి ఆరు శాతం, ఇతరులకు మూడు శాతం మద్దతు దక్కింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఓసీ కమ్యూనిటీలో బీయారెస్ కి 39 శాతం, కాంగ్రెస్ కి 37 శాతం, బీజేపీకి 20 శాతం, ఇతరులకు నాలుగు శాతం మద్దతు దక్కుతోంది. బీసీ కమ్యూనిటీస్ లో చూసుకుంటే ముదిరాజ్ లో బీయారెస్ కి 37 శాతం, కాంగ్రెస్ కి 39 శాతం, బీజేపీకి 17 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతు లభిస్తోంది.

యాదవ సామాజిక వర్గంలో బీయారెస్ కి 50 శాతం, కాంగ్రెస్ కి 32 శాతం, బీజేపీకి 16 శాతం, ఇతరులకు రెండు శాతం మద్దతు లభిస్తోంది. పద్మశాలి సామాజిక వర్గంలో బీయారెస్ కి 50 శాతం, కాంగ్రెస్ కి 33 శాతం, బీజేపీకి 25 శాతం, ఇతరులకు రెండు శాతం దక్కింది.

గౌడ సామాజిక వర్గంలో చూస్తే బీయారెస్ కి 49 శాతం, కాంగ్రెస్ కి 36 శాతం, బీజేపీకి 12 శాతం, ఇతరులకు మూడు శాతం మద్దతు దక్కుతోంది. కంసాలి సామాజిక వర్గంలో చూస్తే బీయారెస్ కి 46 శాతం, కాంగ్రెస్ కి 32 శాతం, బీజేపీకి 19 శాతం, ఇతరులకు మూడు శాతం దక్కింది. ఇతర బీసీ సామాజిక వర్గాలలో బీయారెస్ కి 49 శాతం, కాంగ్రెస్ కి 42 శాతం, బీజేపీకి ఏడు శాతం, ఇతరులకు రెండు శాతం మద్దతు దక్కింది.

ఎస్సీ కమ్యూనిటీలో మాల కేటగిరీలో బీయారెస్ కి 41 శాతం, కాంగ్రెస్ కి 41 శాతం, బీజేపీకి 15 శాతం, ఇతరులకు మూడు శాతం మద్దతు దక్కుతోంది. మాదిగ సామాజిక వర్గంలో బీయారెస్ కి 45 శాతం, కాంగ్రెస్ కి 37 శాతం, బీజేపీకి 12 శాతం, ఇతరులకు ఆరు శాతం మద్దతు లభిస్తోంది. ఎస్టీ కమ్యూనిటీలో బీయారెస్ కి 46 శాతం, కాంగ్రెస్ కి 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఇతరులకు ఆరు శాతం మద్దతు దక్కుతోంది అని ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే పేర్కొంటోంది.