Begin typing your search above and press return to search.

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   31 Jan 2025 10:03 AM
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు
X

గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షనను మే 31వరకు పొడిగించింది.

సంజయ్ పై వచ్చిన అభియోగాలను విచారించిన కమిటీ సిఫార్సలతో ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ను మరో నాలుగు నెలలు పొడిగించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వానికి గతంలో ఫిర్యాదులు అందాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ నెలలో ఐపీఎస్ అధికారి సంజయ్ ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ను తాజాగా పొడిగించింది.

కాగా, సంజయ్ పై ప్రస్తుతం ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అగ్నిమాపక శాఖ డీజీగా ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆయనను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. సౌత్రికా టెక్నాలజీస్, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ అనే సంస్థలను వరుసగా ఏ2, ఏ3గా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.

కాగా, టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును గతంలో అరెస్టు చేసి సీఐడీ మాజీ డీజీ సంజయ్ పై కూటమి ప్రభుత్వం రాగానే వీఆర్ లో పెట్టింది. అనంతరం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ సస్పెన్షన్ ను పొడిగించింది.