Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు షాక్.. రూ.3.25 కోట్ల బోనస్ ఇచ్చిన కంపెనీ!

ఇలాంటి గందరగోళం మధ్య ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా భారీ బోనస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విశేషాలు చూద్దాం.

By:  Madhu Reddy   |   27 May 2026 6:00 PM IST
ఉద్యోగులకు షాక్.. రూ.3.25 కోట్ల బోనస్ ఇచ్చిన కంపెనీ!
X

ప్రస్తుతం ఈరోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు లేఆఫ్స్ ఉంటాయో, ఎప్పుడు జీతాలు కోత పడతాయోనని ఉద్యోగులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి గందరగోళం మధ్య ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా భారీ బోనస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విశేషాలు చూద్దాం.

శామ్‌సంగ్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్:

ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్న తరుణంలో శామ్‌సంగ్ మాత్రం తన చిప్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు భారీ జాక్‌పాట్ ఇచ్చింది. ఇక అక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి సగటున ఏకంగా రూ.3.25 కోట్ల బోనస్ ప్రకటించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ గ్రూపుల్లో "జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి బాసూ" అని తెగ చర్చించుకుంటున్నారు.

లాభాలు కురిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ :

ఇక ఇంతకీ శామ్‌సంగ్‌కు అంత లాభాలు ఎలా వచ్చాయంటే.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ విప్లవం నడుస్తోంది. ఇక దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా శామ్‌సంగ్ తయారు చేసే మెమరీ చిప్స్‌కు విపరీతమైన గిరాకీ వచ్చింది. ఇక గత త్రైమాసికంలో ఈ కంపెనీ చిప్ డివిజన్ ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరగడం విశేషం.

18 రోజుల సమ్మె వెనుక అసలు కథ:

ఈ భారీ బోనస్ వెనుక మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఇటీవల జీతాల పెంపు, బోనస్ ఇవ్వాలంటూ ఈ చిప్ విభాగంలోని ఉద్యోగులు దాదాపు 18 రోజుల పాటు సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఇక సెమీకండక్టర్ తయారీలో ఒక్క రోజు పని ఆగినా కంపెనీకి కోట్లల్లో నష్టం వస్తుంది. అందుకే యాజమాన్యం వెనక్కి తగ్గి, ఉద్యోగుల సంఘంతో చర్చలు జరిపి ఈ భారీ ప్యాకేజీకి ఓకే చెప్పింది.

78,000 మందికి జాక్‌పాట్:

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 78,000 మంది ఉద్యోగుల అకౌంట్లలోకి ఈ భారీ బోనస్ డబ్బులు చేరనున్నాయి. ఇక కేవలం శామ్‌సంగ్ మాత్రమే కాదు.. గత ఏడాది దీనికి పోటీ సంస్థ అయిన 'ఎస్కే హైనిక్స్' కూడా తమ ఉద్యోగులకు ఇలాగే భారీ బోనస్‌లు ఇచ్చింది. ప్రస్తుతం ఏఐ పుణ్యమా అని దక్షిణ కొరియా చిప్ కంపెనీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

కష్టపడి పని చేసే ఉద్యోగులను ఆదరిస్తే కంపెనీలు ఎలా ఎదుగుతాయో చెప్పడానికి శామ్‌సంగ్ నిర్ణయమే ఒక ఉదాహరణ. ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో, తమ లాభాలను ఉద్యోగులతో పంచుకున్న శామ్‌సంగ్ నిజంగా గ్రేట్ అనిపించుకుంది.