Begin typing your search above and press return to search.

ఏపీకి జస్ట్ గెస్ట్ చంద్రబాబు... సజ్జల స్ట్రాంగ్ కౌంటర్...!

టీడీపీ అధినేత చంద్రబాబుని నాన్ లోకల్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్ర వేశారు. ఆయనకు ఏపీతో ఏమి పని అని కూడా జగన్ గట్టిగా నిలదీశారు

By:  Tupaki Desk   |   15 Dec 2023 9:58 AM GMT
ఏపీకి జస్ట్ గెస్ట్ చంద్రబాబు... సజ్జల స్ట్రాంగ్ కౌంటర్...!
X

టీడీపీ అధినేత చంద్రబాబుని నాన్ లోకల్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్ర వేశారు. ఆయనకు ఏపీతో ఏమి పని అని కూడా జగన్ గట్టిగా నిలదీశారు. ఇపుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏపీకి చంద్రబాబు గెస్ట్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

అక్కడ కాపురం ఉంటున్న చంద్రబాబు ఏపీకి అతిధిగా వచ్చి హడావుడి చేస్తారు అని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు అని సజ్జల అంటున్నారు. ఏపీలో సంక్షేమ పాలన నడుస్తూంటే విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.

చంద్రబాబు తన సొంత గ్రామం, సొంత నియోజకవర్గం ఉన్న చంద్రగిరిని వదిలి ఎందుకు కుప్పం వెళ్లారో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. అలాగే మంగళగిరితో నారా లోకేష్ కి ఏమి సంబంధం అని పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థుల మార్పు మీద చంద్రబాబు విమర్శలు చేసిన నేపధ్యంలో సజ్జల ఈ ప్రశ్నలు సంధించారు.

బీసీల మీద అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి జగన్ తన పులివెందుల సీటు ఎందుకు ఇవ్వరని చంద్రబాబు మాట్లాడిన దానికి బదులుగా సజ్జల బాబు మీద విరుచుకుపడ్డారు. బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కుప్పం అని అక్కడకి చంద్రబాబు వలస వెళ్ళి బీసీ సీటులో పోటీ చేస్తున్నారు అని నిందించారు.

అలాగే బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో లోకేష్ ఏ విధంగా పోటీ చేస్తారు అని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. చంద్రబాబు నివాసంతో పాటు ఆస్తులు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని ఆయన ఏపీకి జస్ట్ గెస్ట్ మాత్రమే అని సజ్జల తేల్చేశారు.

మొత్తానికి చంద్రబాబు వైసీపీని విమర్శించే క్రమంలో తాను గతంలో చేసిన వాటిని మరచారని అంటున్నారు. ఆయన కూడా అభ్యర్ధులను మార్చారు. ఆయన కూడా జంబ్లింగ్ విధానం అనుసరించారు. ఇక ఆయన బీసీలు ఉన్న కుప్పంలో అనేక సార్లు పోటీ చేస్తూ వస్తున్నారు. మంగళగిరి టికెట్ ని బీసీలకు ఇవ్వాలని వైసీపీ ఓసీ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టేసింది. మరి చంద్రబాబు తన కుమారుడిని బీసీ నియోజకవర్గంలో పోటీ చేయిస్తున్నారు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

చూస్తే 2019 నాటికి గంజి చిరంజీవి టీడీపీలోనే ఉన్నారు. అయినా ఆయన్ని కాదని లోకేష్ పోటీ చేశారని, 2024 నాటికి ఆ టికెట్ చిరంజీవికి ఇస్తామని చెప్పి మరోసారి అక్కడే లోకేష్ పోటీకి దిగడం అంటే బీసీల మీద టీడీపీ ప్రేమ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బాబు నాన్ లోకల్ ఏపీ మీద నాన్ సీరియస్ ఒక గెస్ట్ మాత్రమే అని వైసీపీ అంటోంది. అలాగే బీసీల పట్ల టీడీపీ అనుసరిస్తున్న విధానాలు డొల్లతనాన్ని కూడా బయటపెడుతోంది.