Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వం మంచి చేసిందంటూ...అనుకోని కితాబు...!

లేదా మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో కూడా చెప్పవచ్చు. కానీ ఏపీలో మాత్రం జగన్ ఏమీ చేసినా మెచ్చుకోలు లేదు సరికదా సర్వ నాశనం చేశారు అంటూ విపక్షాలు రాద్ధాంతాలు చేస్తూ రాజకీయ రచ్చ చేస్తూంటారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:27 AM GMT
జగన్ ప్రభుత్వం మంచి చేసిందంటూ...అనుకోని కితాబు...!
X

ఏపీలో జగన్ ఏమి చేసినా బాగాలేదు అనే విపక్షాలు అంటాయి. అసలు ఏ ప్రభుత్వం అయినా మంచి చేయకుండా ఉంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే తర్కానికి అందకుండా వాదించే తీరు కూడా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ప్రజలకు చేసే మేలుని మరింతగా చేయాలని విపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేయవచ్చు.

లేదా మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో కూడా చెప్పవచ్చు. కానీ ఏపీలో మాత్రం జగన్ ఏమీ చేసినా మెచ్చుకోలు లేదు సరికదా సర్వ నాశనం చేశారు అంటూ విపక్షాలు రాద్ధాంతాలు చేస్తూ రాజకీయ రచ్చ చేస్తూంటారు. దాంతో జనాలకు కూడా ఏది నిజం ఏది అబద్ధం ఏది తప్పు ఏది ఒప్పు అన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు.

ఇది ఒక విధంగా విపక్షాలకే నష్టం అని అంటున్నారు. అయినా ఎందుకో మనసు రాక లేక రాజకీయం వదులుకోకనో కానీ ఏపీలో చూస్తే జగన్ అంటేనే గిట్టని విధంగా పాలిటిక్స్ చేస్తున్నారా అన్న పిక్చర్ ని జనాలకు అయితే చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకూ కరెక్ట్ అన్నది పక్కన పెడితే ఏపీ విషయం పొరుగు రాష్ట్రాల వారు ఇతర ప్రాంతాల వారూ చెప్పాకనే జనాలు ఒహో అనుకోవాల్సి వస్తోంది.

తెలంగాణా బీయారెస్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బోల్డ్ గా ఓపెన్ గా ఏపీలో జగన్ ప్రభుత్వం చాలా మంచి చేస్తోంది అని కితాబు ఇచ్చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్ధులకు ఎనలేని మేలు చేస్తోంది అని కూడా ప్రశంసించారు.

ఒక విధంగా చూస్తే ఏపీ ప్రభుత్వం పేద విద్యార్ధులకు విస్తృత అవకాశాలు కలగచేయడానికి వారికి జ్ఞానం అనే సంపదను బహూకరించడానికి ఈ విధానం అమలులోకి తెచ్చింది అని కూడా విశ్లేషించారు. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దు అనడమేంటని ఆయన ప్రశ్నించారు. అలా వద్దు అనడం అనాగరీకం తప్ప మరేమీ కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. డబ్బున్న వారు అగ్ర వర్ణాల పిల్లలే అంగ్ల భాషను నేర్చుకోవాలా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

పేదలకు ఇంగ్లీష్ విద్య ఎంత అవసరమో తనకు అనుభవ పూర్వకంగా తెలుసు అని ఆయన అన్నారు. మొత్తానికి ఇంత బలంగా ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ఏ రాజకీయ నేత ఇటీవల కాలంలో మాట్లాడినది లేదు అనే అంటున్నారు. ఒక వైపు తెలంగాణా ఎన్నికల బిజీలో ప్రచారంలో ఉన్న ప్రవీణ్ కుమార్ ఏపీ ప్రస్తావనను తెచ్చి జగన్ని పొగడం విశేషం.

తెలుగు భాష ముద్దు అంటూ చాలా పెద్ద పదవులు చేసిన పెద్ద మనుషులు ఒక వైపు సుద్దులు చెబుతున్న నేపధ్యంలో ప్రవీణ్ లాంటి వారు పలికే నిజాలు ఎంతవరకూ వారి చెవికి ఎక్కుతాయన్నది కూడా చూడాల్సి ఉంది. అలాగే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఇంటర్వ్యూలలో సానుకూలంగా చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ సామాజిక పించన్ విడతల వారీగా పెంచిన తీరుని తెలంగాణలో అమలు చేస్తామని కేసీయార్ కూడా చెప్పారు. మొత్తానికి జగన్ పాలన మీద మంచి ఉంటే చెప్పుకుంటున్నారు. ఇది ఏపీలోని రాజకీయ పక్షాలకు కూడా ఆలోచించేలా ఉందా అంటే జవాబు చూడాలి మరి.