Begin typing your search above and press return to search.

బాబు 'కుర్చీ మ‌డ‌త పెట్టి' కామెంట్‌పై ఆర్జీవీ సెటైర్

ఇదే కాదు.. రాజ‌కీయంగాను ఆర్జీవీ వైఖ‌రి వైయ‌స్ జ‌గ‌న్ కు అనుకూలంగా ఉంద‌నేది నిర్వివాదాంశం.

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:33 PM GMT
బాబు కుర్చీ మ‌డ‌త పెట్టి కామెంట్‌పై ఆర్జీవీ సెటైర్
X

ఆర్జీవీ వ‌ర్సెస్ చంద్ర‌బాబు ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఇటీవ‌ల ఆర్జీవీ తెర‌కెక్కించిన `వ్యూహం` రిలీజ్ కాక‌పోవడానికి చ‌ట్ట‌ప‌ర‌మైన అడ్డంకులు సృష్టించిన‌ది తేదేపా నాయ‌కులే కావ‌డం తెలిసిన‌దే. దీనిపై ఆర్జీవీ చాలా పోరాడారు.. కానీ సినిమా రిలీజ్ కాలేదు. ఇదే కాదు.. రాజ‌కీయంగాను ఆర్జీవీ వైఖ‌రి వైయ‌స్ జ‌గ‌న్ కు అనుకూలంగా ఉంద‌నేది నిర్వివాదాంశం.

ఇప్పుడు సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆర్జీవీ ప్ర‌తిస్పంద‌న చ‌ర్చ‌గా మారింది. ఇక స్లీవ్స్ మ‌డ‌త పెట్టాల్సిన టైమ్ వ‌చ్చింద‌ని సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కుర్చీ మ‌డ‌త పెడ‌తామంటూ చంద్ర‌బాబు- లోకేష్ అండ్ కో కౌంట‌ర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే ఆర్జీవీ లైన్‌లోకొచ్చారు. చంద్ర‌బాబు అండ్ కోపై ఎక్స్ లో సెటైర్లు వేసారు. కుర్చీ మ‌డ‌త పెట్టి అనే బూతుకు చంద్ర‌బాబుకు అర్థం తెలుసా అనేది నా భేతాళ ప్ర‌శ్న‌? అని `ఎక్స్` ఖాతాలో రాసుకొచ్చారు.

చంద్ర‌బాబు, లోకేష్ త‌దిత‌రుల‌పై ఆర్జీవీ సెటైర్లు వేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోను ఆయ‌న వారి వ్యాఖ్య‌ల‌కు త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసారు. ఇప్పుడు మ‌రోసారి ఆర్జీవీ ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.