Begin typing your search above and press return to search.

రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద ఆర్జీవీ... ట్వీట్ వైరల్!

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... సుమారు 46 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Oct 2023 8:51 AM GMT
రాజమండ్రి సెంట్రల్  జైల్  వద్ద ఆర్జీవీ... ట్వీట్  వైరల్!
X

డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఏమి చేసినా ఆన్ లైన్ లో ఫుల్ వైరల్ అయిపోతుంటుందని అంటారు. సమకాలీన సామాజిక, రాజకీయ, అంతర్జాతీయ, సినిమా అంశాలలో దేనిపైనైనా స్పందించాలనిపిస్తే స్పందించేస్తుంటారు ఆర్జీవీ. ఇందులో కొన్ని స్పందనలు బిఫోర్ వోడ్కా అయితే... కొన్ని విత్ వోడ్కా, మరికొన్ని ఆఫ్టర్ వోడ్కా అని ఆయనే చెబుతుంటారు! ఈ సమయలో రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద నిలబడి ఒక సెల్ఫీ తీసుకున్నారు ఆర్జీవి!

అవును... గతకొంతకాలంగా టీడీపీ, జనసేనలను ఆర్జీవీ విపరీతంగా వెంటాడుతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనల పేర్లు పెద్దగా ప్రస్తావించకపోయినా చెప్పాలనుకున్న విషయం చీకట్లో గిల్లినంత స్పష్టంగా చెబుతుంటారని అంటుంటారు. ఈ సమయమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న విషయాన్ని తనదైన శైలిలో వెల్లడించారు!

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... సుమారు 46 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి చంద్రబాబు ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో ఉంటున్నారు.

ఈ సమయంలో చంద్రబాబుకు మూడు పూటలా ఇంటి భోజనం, మందులు అందిస్తున్నారు. అదేవిధంగా.. మూడు పూటలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల వైద్యుల సూచనల మేరకు కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేశారు జైలు అధికారులు. ఫలితంగా స్కిన్ అలర్జీ పెరగకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలో... రాజమండ్రి వెళ్లిన దర్శకుడు రాం గోపాల్ వర్మ సెంట్రల్ జైలు ముందు నిల్చుని సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోపై "నేను బయట.. అతను లోపల" అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ పోస్ట్ పై రకరకాల కామెంట్లు దర్శనమిస్తున్నాయి.

ఇదే సమయంలో ఈ సందర్భంగా... "ములాకత్ కి వెళ్తున్నారా" అని ఒకరు ట్వీట్ చేస్తే... "నెక్స్ట్ సినిమా ఫంక్షన్ కూడా అక్కడే చేసేలా ఉన్నారుగా" అని మరొకరు కామెంట్ పెడుతుంటే... "జైల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా" అంటూ ఇంకొకరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది!