Begin typing your search above and press return to search.

అద్భుతం.. వెయ్యేళ్ల నాటి శ్రీరామ విగ్రహానికి రిపేరు

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెయ్యేళ్ల పురాతన శ్రీరాముని విగ్రహానికి రిపేర్ చేశారు. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన వేలు విరిగింది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 3:13 PM IST
అద్భుతం.. వెయ్యేళ్ల నాటి శ్రీరామ విగ్రహానికి రిపేరు
X

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెయ్యేళ్ల పురాతన శ్రీరాముని విగ్రహానికి రిపేర్ చేశారు. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన వేలు విరిగింది. దీనికి మరమ్మతులు చేశారు. 1,000 ఏళ్ల విగ్రహానికి మరమ్మతు చేయడంపై అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం అయింది.

ఆలయ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా విగ్రహానికి సంబంధించి ఎడమ చేతి వేళ్లలో ఒకదానికి చిన్నపాటి ఫ్రాక్చర్ ఏర్పడింది. దాంతో ఆలయ అధికారులు దానిని తాత్కాలికంగా బంగారం కవచంతో కప్పి పెట్టారు. కొండపై ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపింది. సహస్రాబ్ది నాటిదని భావిస్తున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

12 ఏళ్లకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలకు మరమ్మతు చేయించడం తిరుమలలో జరుగుతుంటుంది. ఈ విగ్రహం వేలు కూడా విరిగి ఐదేళ్లకు పైగా కావడంతో.. ఇటీవల ఈ విషయాన్ని తిరుమలలో వార్షిక బ్రహ్మత్సవాల సందర్భంగా జీయర్ స్వామిజీలు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదిరత కార్యక్రమాలు నిర్వహించారు.

అంతేకాకుండా.. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి అధికారిక సంరక్షకుడు, టీటీడీ కూడా ఆలయంలోని శ్రీరామ అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహాలకు చిన్నచిన్న నష్టాలను సరిచేయాలని నిర్ణయించి ఆ మేరకు రిపేరు చేశారు. తదుపరి డ్రైవ్ మళ్లీ 2030లో జరుగుతుంది.