ఉచిత బూడిద కోసం కుమ్ములాటల్లో కీలక పరిణామం!
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Nov 2024 6:28 AM GMTరాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లైయాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి నియోజకవర్గాల్లోని కూటమి నేతల మధ్య రచ్చ నెలకొంది. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలక పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవి తీవ్రస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. ఈ విషయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా... జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ఈ ముగ్గురు కూటమి నేతలూ ముఖ్యమంత్రిని శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం.
అసలేం జరిగిందంటే...?:
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) బూడిదను సిమెంట్ పరిశ్రమలకు తరలించే విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి - ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. గతంలో జేసీ వర్గీయులు ఈ బూడిదను తరలించుకుంటుండగా.. రావాణాలో తమకూ వాటా కావాలని ఆదినారయణరెడ్డి వర్గీయులు పట్టుబట్టారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. బూడిదను వాహనాల్లో నింపకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని అంటున్నారు. దీతో.. ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రికి రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డగించారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో... జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి సీఎంవో నుంచి సమాచారం అందిందని.. ఈ తరుణంలో ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశానికి రానున్నారని అంటున్నారు.