Begin typing your search above and press return to search.

వైఎస్సార్​ రెడీ.. చంద్రోదయంకు మోక్షం ఎప్పుడో?

వివరాళ్లోకి వెళితే ఏపీలో ప్రస్తుతం ప్రధాన పార్టీలైన తేదేపా - వైఎస్సార్​సీపీ మధ్య అధికారం కోసం పోరు కొనసాసాగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Oct 2023 1:30 PM GMT
వైఎస్సార్​ రెడీ.. చంద్రోదయంకు మోక్షం ఎప్పుడో?
X

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కొనసాగుతున్న ట్రెండ్ బయోపిక్స్. ఈ క్రమంలోనే ఏపీ పాలిటిక్స్​లో కీలక నేతల జీవిత చరిత్రల ఆధారంగా కూడా సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాలు సరికొత్త అప్డేట్స్​తో ముందుకొస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి.


వివరాళ్లోకి వెళితే ఏపీలో ప్రస్తుతం ప్రధాన పార్టీలైన తేదేపా - వైఎస్సార్​సీపీ మధ్య అధికారం కోసం పోరు కొనసాసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు... ఈ పార్టీ అధినేతల బయోపిక్స్​ కూడా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.


ఇందులో భాగంగానే.. రామ్ గోపాల్ వర్మ.. ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా దీన్ని రూపొందించారు. తొలి భాగం వ్యూహం పేరుతో రానుండగా.. సీక్వెల్‌ శపథం అనే పేరుతో రానుంది. వ్యూహం సినిమాను నవంబర్ 10వ తేదీన, సీక్వెల్​గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసామాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తున్నారు.


ఇకపోతే ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ మూవీ యాత్ర . మహి వి రాఘవ్ దర్శకుడు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు యాత్ర 2 త్వరలో రిలీజ్ కానుంది.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెర‌కెక్కింది. జగన్ పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టించగా.. వైఎస్​ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రానుంది.

అలా ఈ మూడు సినిమా వైఎస్సార్ ఫ్యామిలీకి సంధించిన బ్యాక్​డ్రాప్​లోనే వస్తున్నాయి. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం. ఎప్పుడో 2018లో మూవీ అనౌన్స్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ను కూడా అప్పట్లో విడుదల చేశారు. కానీ ఈ చిత్రం ఇప్పుడు అడ్రెస్ లేదు. ఇంకా రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకోలేదు. మరి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో..