Begin typing your search above and press return to search.

’’ఒక్క వేటుకు నరికి పెడతా..’’ రక్తచరిత్ర థీమ్ సాంగ్ ట్రెండింగ్

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇప్పుడు రక్త చరిత పాట మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   7 May 2025 11:56 AM
’’ఒక్క వేటుకు నరికి పెడతా..’’ రక్తచరిత్ర థీమ్ సాంగ్ ట్రెండింగ్
X

దశాబ్దాల అనంతపురం ఫ్యాక్షన్ గొడవల ఆధారంగా తెరకెక్కింది రక్తచరిత్ర సినిమా. ఎన్ని విమర్శలు ఉన్న దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకతను మనం కాదనలేం.. 30 ఏళ్ల కిందటే బాలీవుడ్ లో సంచలనం రేపిన దర్శకుడు ఆయన. 15 ఏళ్ల కిందట తీసిన రక్త చరిత్ర రెండు భాగాలుగా విడుదలైన ప్రేక్షకాదరణ పొందింది. అందులోనూ ఆ సినిమాలోని ’’రక్త చరిత.. రక్త చరిత’’ పాట బాగా పాపులర్ అయింది.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇప్పుడు రక్త చరిత పాట మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. భారత దళాలు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యానికి రక్త చరిత సాంగ్ ను జోడించి వైరల్ చేస్తున్నారు.

’’అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ.. ఎత్తిన తలకి రాత పెడతా.. ఒక్కటే వేటుకి నరికి పెడతా.. ఉరుకు ఉరుకు ఉరకరో.. నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.. రక్త చరిత’’ అంటూ సాగే హిందీ వెర్షన్ పాటను భారత సైన్యం వీరత్వానికి మేళవించడంతో గుండెలు ఉప్పొంగేలా చేస్తింది. సైనికుడు నడిచి వెళ్తుండగా.. శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని పొగుడుతూ సాగిన ఈ పాట విన్నవారికి మాంచి కిక్ ఇస్తోంది.

రక్త చరిత్ర సినిమా రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి భాగంగాలో పరిటాల రవి కుటుంబం, రెండో భాగంగా మద్దెలచెరువు సూరి కుటుంబాల గురించి చూపించారు రామ్ గోపాల్ వర్మ. తెలుగు, హిందీల్లో ఏక కాలంలో నిర్మించారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, కోట శ్రీనివాసరావు వంటి పెద్ద నటులు నటించిన ఈ సినిమాల నేపథ్యం అందరినీ ఆకర్షింపజేసింది. మరీ ముఖ్యంగా పరిటాల రవిని పోలిన పాత్రలో వివేక్ ఒబెరాయ్.. మద్దెలచెరువు సూరిని పోలిన పాత్రలో సూర్య తమదైన నటనతో ఆకట్టుకున్నారు.