Begin typing your search above and press return to search.

రాజమండ్రికి రజనీకాంత్... చంద్రబాబుతో ములాకత్ పై రియాక్ట్!

అవును... ఇటీవల చంద్రబాబునాయుడు అరెస్టు రిమాండ్ నేపథ్యంలో నార లోకేష్ కు ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్

By:  Tupaki Desk   |   17 Sept 2023 12:35 PM IST
రాజమండ్రికి రజనీకాంత్... చంద్రబాబుతో ములాకత్  పై రియాక్ట్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని, ములాకత్ లో మీట్ అవ్వబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వారంలో రెండు ములాకత్ లు మాత్రమే అనుమతి అని జైలు అధికార్లు ప్రకటించిన నేపథ్యంలో... సోమవారం కలవొచ్చని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా రజనీకాంత్ స్పందించారు.

అవును... ఇటీవల చంద్రబాబునాయుడు అరెస్టు రిమాండ్ నేపథ్యంలో నార లోకేష్ కు ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్... ఈ సారి నేరుగా రాజమండ్రికి వచ్చి చంద్రబాబుని కలిసి వెళ్లబోతున్నారన్ని అంటున్నారు. ఇప్పటికే ఒకసారి భువనేశ్వరి - లోకేష్ - బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ - బాలయ్య - లోకేష్ కలిసిన సంగతి తెలిసిందే.

అనంతరం మూడో ములాకత్ కోసం భువనేశ్వరి ప్రయత్నించగా... అనుమతి ఇవ్వలేదు జైల్ శాఖ అధికారులు. దానిపై సవివరంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ కారణంగానే రజనీకాంత్ రాజమండ్రికి రాలేదని, చంద్రబాబుతో ములాకత్ అవ్వలేదని అంటున్నారు. రెండో వారంలో మరో రెండు ములాకత్ లు ఉంటాయి కాబట్టి సోమవారం తర్వాత వస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ స్పందించారు. "టీడీపీ అధినేత చంద్రబాబుని కలుద్దామని అనుకున్నాను. కానీ, ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటం వల్ల కుదరలేదు" అని వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొనేందుకు వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ ఈ మేరకు స్పందించారు. అయితే ఎప్పుడు తిరిగి వస్తారనే విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు!