Begin typing your search above and press return to search.

'దళిత క్రైస్తవులు భయపడొద్దు'.. పీవీ సునీల్ కీలక వ్యాఖ్యలు!

అవును... దళితులు క్రైస్తవ్యంలోకి మారితే వారికి దళితులుగా రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులు వారు కోల్పోతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే!

By:  Raja Ch   |   23 Dec 2025 1:30 PM IST
దళిత క్రైస్తవులు భయపడొద్దు.. పీవీ సునీల్ కీలక వ్యాఖ్యలు!
X

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో క్రిస్మస్ వేడుకకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ 'ఎక్స్' వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఎస్సీలు ఏ మతంలోకి వెళ్లినా ఆ కులానికున్న రిజ్వర్వేషన్లు పోకూడదనే తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టిన విషయాన్ని వెళ్లడిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... దళితులు క్రైస్తవ్యంలోకి మారితే వారికి దళితులుగా రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులు వారు కోల్పోతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే.. ఇంట్లో జీసస్ నమూనా ఫోటో ఉన్నంత మాత్రాన్న.. బైబిల్ చదివినంత మాత్రాన.. చర్చికి వెళ్లినంత మాత్రాన వారు క్రైస్తవులు కాదని.. వారిని అలా పరిగణించి వారికి ఎస్సీ రిజర్వేషన్ హక్కులను తొలగించకూడదని చెబుతూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు పీవీ సునీల్.

ఇందులో భాగంగా తన వీడియోలో... 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో "దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలి" అని తీర్మానం పాస్ చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపారని సునీల్ కుమార్ గుర్తు చేశారు. ఇదే రిజల్యూషన్ ను 2019 తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారని.. ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే తీర్మానం చేశారని పీవీ సునీల్ కుమార్ తెలిపారు.

చాలా మంది.. ఇంట్లో జీసస్ నమూనా ఫోటో ఉంటే క్రైస్తవులు అయిపోతున్నారని అంటున్నారని చెబుతూ.. మా ఇంట్లో గౌతం అదానీ బొమ్మ ఉందని, అంత మాత్రాన్న ఆయన ఆస్థిలో నాకు ఓటా వస్తుందా అని సునీల్ ప్రశ్నించారు. మరోవైపు చర్చికి వెళ్తే క్రీస్టియన్ అయిపోతారని అంటున్నారు.. తాను చాలా సార్లు పాస్ తీసుకుని పార్లమెంటుకు వెళ్లాలని, అంతమాత్రాన్న తాను ఎంపీ అయిపోతానా అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏపీ హైకోర్టు చెప్పిన తీర్పును ప్రస్థావించారు. ఇందులో భాగంగా... కేవలం బాప్తీస్మం తీసుకున్నవారు మాత్రమే క్రైస్తవులు.. ఓ వ్యక్తికి క్రీస్టియన్ పేరు ఉన్నంత మాత్రాన్న ఆ వ్యక్తి క్రీస్టియన్ అయిపోడని ఆయన తెలిపారు. ఎవరైనా చర్చికి వెళ్తున్నారనే సాకుతో ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం పెడితే.. ఈ తీర్పు విషయం చెప్పాలని తెలిపారు.

అప్పుడు వారందరికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్ష పడుతుందని పీవీ సునీల్ కుమార్ అన్నారు. ఇలాంటి అనవసరపు ఇబ్బందులకు గురవుతున్నవారందరికీ తాను, సుధాకర్ బాబు లాంటి వారు అండగా ఉంటామని.. తోడుగా ఉంటామని.. నిర్భయంగా ఉండాలని సూచించారు.