Begin typing your search above and press return to search.

బాబుతో పెద్దాయన ములాఖత్ ఎపుడు...?

సీనియర్ నేతగా బాబు తరువాత అంతటి వారుగా ఉన్న అశోక్ చంద్రబాబుతో ఎపుడు ములాఖత్ అవుతారు అన్న ప్రశ్న అయితే అందరిలో కలుగుతోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 1:30 AM GMT
బాబుతో పెద్దాయన ములాఖత్ ఎపుడు...?
X

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అంటే విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజునే చెప్పుకుంటారు. ఆయన రాజకీయ జీవితం కూడా చంద్రబాబుతో పాటే స్టార్ట్ అయింది. 1978లో జనతా పార్టీ తరఫున రాజు గారు మొదటి సారి ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి గెలిచారు. 1983 నుంచి ఆయన టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు.

సీనియర్ నేతగా బాబు తరువాత అంతటి వారుగా ఉన్న అశోక్ చంద్రబాబుతో ఎపుడు ములాఖత్ అవుతారు అన్న ప్రశ్న అయితే అందరిలో కలుగుతోంది. ఆయన టీడీపీ రాజ్యాంగం అంతా క్షుణ్ణంగా తెలిసిన వారు. పార్టీ పునాది నుంచి ఉన్నవారు బాబు తరువాత పార్టీ ప్రెసిడెంట్ అయ్యే స్థాయి తాహతూ ఆయనకే ఉన్నాయి.

మరి బాబుతో ఎంతో సంబంధ బాంధవ్యాలు ఉన్న రాజు గారు చంద్రబాబు రాజమండ్రి జైలులో కారాగారవాసం లో ఉంటే ఇప్పటిదాకా ములాఖత్ కాకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. అనంతపురానికి చెందిన పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు బాబుని జైలులో కలిశారు. ఇంకా ఇతర సీనియర్ నేతలు కలసిన వారిలో ఉన్నారు.

పార్టీని బాబు లేని టైం లో ఎలా నడపాలో అన్న దాని మీద చర్చలు జరపడంతో పాటు బాబును పరామర్శించి ఒక స్నేహితుడిగా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత అశోక్ కి ఉందని అంటున్నారు. అయితే అశోక్ ఈ మధ్య కాలంలో ఎందులో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అన్న మాట వినిపిస్తోంది.

ఆయన బాబు జైలుకు వెళ్ళిన తరువాత టీడీపీ శ్రేణులు చేస్తున్న ఆందోళలనలలోనూ పెద్దగా పాలు పంచుకోవడంలేదు. పెద్దాయనకు ఒంట్లో బాగులేదు అన్న ప్రచారం సాగుతోంది. అదెంత వరకూ నిజమో తెలియదు కానీ విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం అశోక్ బంగ్లాను సవాల్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అశోక్ టికెట్ విషయంలో కూడా డైలమా పెట్టేలా పావులు కదుపుతోంది. ,

దీంతో పాటు విజయనగరం జిల్లాలో ఒకనాడు రాజు గారి కనుసన్ననలో నడచిన పార్టీ అంతా ఇపుడు ఎక్కడికక్కడ ఏవ్రికి వారుగా మారిపోయింది. దాంతో పూర్వం మాదిరిగా రాజు గారి మాట చెల్లడం లేదు అంటున్నారు. ఇంకో వైపు చూస్తే తన రాజకీయ వారసురాలిగా ఉన్న కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ కోసం రాజు గారు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలవంతం కావడంలేదు. ఇక తనను వ్యతిరేకించేవారికి పార్టీలో కొందరు మద్దతుగా నిలుస్తున్నారు అని కూడా ఆయనకు గుస్సాగా ఉందని టాక్.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు తో రాజు గారు ములాఖత్ అయితే బాగుంటుంది అని అన్న వారే ఎక్కువగా ఉన్నారు. మరి ఆయన కూడా అందరి మాదిరిగానే సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో తీర్పు కోసం చూస్తున్నారేమో అంటున్నారు. ఒక వేళ కనుక అక్కడ అనుకూలంగా తీర్పు వస్తే ఓకే లేకపోతే ములాఖత్ కి రాజు గారు వెళ్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.