Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి... వీడియో!

ఏపీలో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చల్లబడటం లేదు

By:  Tupaki Desk   |   14 May 2024 12:48 PM GMT
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి... వీడియో!
X

ఏపీలో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చల్లబడటం లేదు. ఇంకా ఇరు వర్గాల మధ్య దాడులు ఆగడం లేదు. మరోవైపు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్‌ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.

అవును... పోలింగ్ పూర్తయ్యి కొన్ని గంటలు గడుస్తున్నా ఇంకా పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడటం లేదు. ఈ క్రమంలో... పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ సమయంలో... రామాపురానికి చెందిన ఓ వైసీపీ నేత, అతని అనుచరులు సుత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డారని అంటున్నారు.

ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌ మెన్‌ కు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది! నేపథ్యంలోనే పులివర్తి నాని గన్‌ మెన్‌ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు.. నిందితులు అక్కడి నుంచి చెదిరిపోయారని అంటున్నారు. ఈ సమయంలో... ఈ దాడి గురించి పులివర్తి నాని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

అంతకముందు దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సమయంలో దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలుస్తుంది. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి!!