Begin typing your search above and press return to search.

మోడీని వెంటాడుతున్న జ‌నం భ‌యాలు!

ఎందుకంటే.. మోడీ తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్పుడు జ‌నాల‌ను వెంటాడుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 April 2024 10:12 AM GMT
మోడీని వెంటాడుతున్న జ‌నం భ‌యాలు!
X

మ‌నం చాలా మంచి నాయ‌కులం అని నేత‌లు ప్ర‌క‌టించుకోవ‌డం కాదు.. జ‌నాలు కూడా న‌మ్మాలి. ఇలా జ‌రిగిన‌ప్పుడే.. రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు వాల్యూ ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో ప్ర‌దాని మోడీ ఇమే జ్‌ను ప్ర‌ధానంగా చూపిస్తూ ... రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి ఇదే ఇబ్బందిగా మార‌నుంది. ఎందుకంటే.. మోడీ తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్పుడు జ‌నాల‌ను వెంటాడుతున్నాయి. అదేవిధంగా జ‌నం మూడ్ న‌రేంద్ర మోడీని కూడా వెంటాడుతోంది.

తాజాగా జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా పెంపుదలను నిలిపివేస్తూ జాతీయ రహదారుల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. గత వారమే కేంద్రం ఈ మేరకు ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈసీ ఆమేరకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా జాతీయ రహదారులపై టోల్‌ ధరలు ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతాయి.

అయితే టోల్‌ ఫీ పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలంటూ స్థానిక ప్రాజెక్టు డైరెక్టర్లు మార్చి 30వ తేదీన మౌఖికంగా టోల్‌ నిర్వహణ సంస్థలను ఆదేశించారు. దీనిపై హైవే డెవలపర్స్‌ ఆర్గనైజేషన్‌, జాతీయ హైవే బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఆదివారం స్పందించాయి. అయితే, ఎటువంటి కారణం చెప్పకుండా పెంపుదలను నిలిపివేయాలంటూ జారీ చేసిన మౌఖిక ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయి. ఇక్క‌డే అనేక సందేహాలు జ‌నాల‌ను ముసురుకున్నాయి.

పెంచేది పెంచేదే.. కానీ, ఎన్నిక‌లు కాబ‌ట్టి ఆపారు.. అనే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వంట‌గ్యాస్‌, పెట్రోలు ధ‌ర‌ల విష‌యంలోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతోంది. మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వం వ‌స్తే.. వంటగ్యాస్ ధ‌ర‌లు.. ఈ ఏడాది చివ‌ర‌కే రూ.1500-1700 వ‌ర‌కు పెరుగుతాయ‌ని.. జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ప్ర‌స్తుతానికి ఎన్నిక‌ల నేప‌థ్యంలో నెల రోజుల కింద‌ట మోడీ స‌ర్కారు రూ.100 త‌గ్గించింది. కానీ, ఈ త‌గ్గింపు వెనుక ఎన్నిక‌ల రాజ‌కీయం ఉంద‌నేది తాజాగా బ‌ల‌ప‌డింది.

ఇక‌, పెట్రోల్ ధ‌ర‌ల‌ను రూ.2 చొప్పున లీట‌రుకు త‌గ్గించారు. అయితే.. మ‌రోసారి మోడీ కొలువుదీరితే ఈధ‌ర‌లు కూడా ఆకాశానికి చేరుకుంటాయ‌న్న చ‌ర్చ బ‌లంగా వినిపిస్తోంది. ఈ మూడు కార‌ణాలు.. మోడీకి జ‌నాల నుంచి భ‌యం పుట్టిస్తున్నాయ‌నేది జాతీయ మీడియా టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓడిపోవ‌డానికి కూడా ఇదే కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం.