Begin typing your search above and press return to search.

పీకేని పక్కకెళ్లి ఆడుకోమంటున్న వైసీపీ... కామెంట్స్ వైరల్!

దీంతో... బీహార్ లో జనం పక్కకెళ్లి ఆడుకో మంటే ఏపీపై బురదజల్లుతున్నారని ఒకరంటే... తీసేసిన తహశీల్దార్ కబుర్లు ఎవరూ వినరంటూ మరొకరు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   8 April 2024 8:34 AM GMT
పీకేని పక్కకెళ్లి ఆడుకోమంటున్న వైసీపీ... కామెంట్స్ వైరల్!
X

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా.. ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పరిపాలన సక్రమంగా లేదని.. కేవలం డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నారని.. ఏపీ వంటి మధ్యాదాయ రాష్ట్రాల్లో కేవలం సంక్షేమ పథకాలే గెలిపించవని.. పట్టణ ఓటర్ల మద్దతు కొరవడుతోందని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో తాజాగా మరోసారి వైఎస్ జగన్ పై స్పందించారు ప్రశాంత్ కిశోర్. ఇందులో భాగంగా... ఏపీలో అభివృద్ధి జరగడం లేదని, కేవలం డబ్బులు పంచడం వల్ల గెలుస్తానని జగన్ భావిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం అని వ్యాఖ్యానించారు. దీంతో... బీహార్ లో జనం పక్కకెళ్లి ఆడుకో మంటే ఏపీపై బురదజల్లుతున్నారని ఒకరంటే... తీసేసిన తహశీల్దార్ కబుర్లు ఎవరూ వినరంటూ మరొకరు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ స్పందించింది. ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా... చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో ఇలా మాట్లాడుతున్నాడని.. ఏపీలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియాలంటే కేంద్రగణాంకాలు చూడాలని సూచించారు. ఏపీలో ప్రజల జీవన ప్రమాణాల్లో వృద్ధి ఏస్థాయిలో ఉందో తెలుసుకుని మట్లాడాలని తెలిపింది. సొల్లు కబుర్లతో బురద జల్లొద్దన్ని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆన్ లైన్ వేదికగా స్పందించిన వైసీపీ... "కొత్తగా చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో అలా అంటున్నావు కానీ.. రాష్ట్రాభివృద్ధికి ఎవరేం చేశారన్నది కేంద్ర గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి ప్రశాంత్ కిషోర్" అని సూచించింది.

ఇదే సమయంలో... "విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో వృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఏ స్థాయిలో ప్రగతి సాధించిందో తెలుసుకో, ఊరకనే సొల్లు కబుర్లతో బురద జల్లడం కాదు!" అని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.

జగన్ లీడర్.. చంద్రబాబు ప్రొవైడర్!:

ఇదే సమయంలో... ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... ప్రశాంత్‌ కిషోర్‌ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని మొదలుపెట్టిన బొత్స.. లీడర్‌ కు, ప్రొవైడర్‌ కు ఉన్న తేడా కూడా పీకేకు తెలియడం లేదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ అని స్పష్టం చేశారు!

ఇదే క్రమంలో... చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్.. బ్రోకరిజం అని మండిపడిన బొత్స... అందువల్లే ఆయన వద్ద నుంచి ప్యాకేజీ తీసుకుని మరి పీకే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని చెబుతున్న పీకే... గత ఐదేళ్లలో జగన్‌ నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ ముందుందని.. జీడీపీలో నాలుగో స్థానంలో ఉందని.. నీతి అయోగ్ విశ్లేషణలు, పీఎం అడ్వైజరీ కమిటీ నివేదికల్లోనూ ఏపీ ముందుందనే విషయం తెలుసుకోవాలని సూచించారు.