Begin typing your search above and press return to search.

జిల్లా రాజ‌కీయం: ప్ర‌కాశం ఒక‌వైపే చూస్తోందే.. !

జిల్లా రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో అనేక మంది కీల‌క నాయ‌కులు ఉన్నారు. విభిన్న‌మైన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ..

By:  Tupaki Desk   |   21 July 2025 10:00 PM IST
జిల్లా రాజ‌కీయం: ప్ర‌కాశం ఒక‌వైపే చూస్తోందే.. !
X

జిల్లా రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో అనేక మంది కీల‌క నాయ‌కులు ఉన్నారు. విభిన్న‌మైన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ.. ఒక‌ప్పుడు ఉన్న వివాదాలు, ఎదురు దాడులు.. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు వంటివి మాత్రం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. వైసీపీ నుంచి కీల‌క నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. మ‌రికొంద‌రు సైలెంట్ అయ్యారు. ఇంకొంద‌రు లోపాయికారీగా అధికార పార్టీ నాయ‌కుల‌తో చేతులు క‌లిపారు. ఏదేమైనా.. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో అధికార పార్టీ నాయ‌కుల హ‌వా మాత్ర‌మే క‌నిపిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే.... చీరాల నియోజ‌క‌వ‌ర్గం అంటే.. రాజ‌కీయ వివాదాల‌కు కేరాఫ్‌. కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి మౌనంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌లో ఉన్న‌.. ఆమంచికృష్ణ‌మోహ‌న్ కూడా.. బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎవ‌రినీ ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. ఇక‌, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. దాదాపు ఇదే ప‌రిస్థితి ఉంది. కేసులు కావొచ్చు.. గ‌తంలో చేసిన అక్ర‌మాలు కావొచ్చు.. మాజీ నాయ‌కులు ఎవ‌రూ నోరు విప్ప‌డం లేదు.

ఇక‌, ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. అస‌లు పోటీనే లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు రాజ‌కీయాలు సాగుతున్నాయి. అయితే, ఆయ‌న కూడా.. ప్ర‌జ‌ల‌కు దూరంగా కాకుండా.. మ‌రింత ద‌గ్గ‌ర అవుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలానే.. ఒక‌ప్పుడు.. ఎర్ర‌గొండ‌పాలెంలో రాజ‌కీయ దుమారం రేగేది. కానీ, ఇప్పుడు అలా లేదు. అదేవిధంగా కొండ‌పిలోనూ.. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామికి ఎదురు లేద‌న్న చ‌ర్చ ఉంది.

సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నా.. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఒంగోలు రాజ‌కీ యాలు అంద‌రికీ తెలిసిందే. ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నా రు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న కూడా కూట‌మి నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతున్నారు. ఇక్క‌డ టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల హ‌వా మాత్ర‌మే క‌నిపిస్తోంది. అది కూడా.. అంద‌రూ క‌లిసి క‌ట్టుగానే ఉన్నారు. చిన్న చిన్న విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వానికి ఇబ్బందులు వ‌చ్చేలా అయితే..ఎవ‌రూ వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.