Begin typing your search above and press return to search.

ములాఖత్ తర్వాత పవన్ కు ముట్టింది ఎంత ?

చంద్రబాబు నాయుడుతో జైలులో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముట్టింది ఎంత

By:  Tupaki Desk   |   20 April 2024 10:29 AM GMT
ములాఖత్ తర్వాత పవన్ కు ముట్టింది ఎంత ?
X

’’చంద్రబాబు నాయుడుతో జైలులో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముట్టింది ఎంత ? క్టోరల్‌ బాండ్స్‌ రూపంలో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టింది ఎంత ? చంద్రబాబుతో కలిశాక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నది వాస్తవం. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలోనే బయటపెడతా’’ అని మాజీ జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. జనసేన పార్టీ అకౌంట్‌లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్‌ చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం దేవాలయానికి పవన్ కళ్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని, పవన్‌ హరిహర వీరమల్లు సినిమాకు అసలు నిర్మాత ఎవరో చెప్పాలని, దిల్ రాజు మీద పవన్ ఎందుకు ఐటీ అధికారులకు పిర్యాదు చేశారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్‌ చేయడం గమనార్హం.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడని, ఈ విషయంలో ఆయన కాపు యువతకు సమాధానం చెప్పాలని, టీడీపీ జెండా మోసే కూలీలుగా జనసేన కార్యకర్తలను పవన్ మార్చారని మహేష్ విమర్శించారు. అసలు పవన్ దారేంటో ప్రజలకు వివరించాలని, 13 జిల్లాలలో పది జిల్లాలలో జనసేన పార్టీనే లేదని ఈ విషయంలో పవన్ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. జనసేన టికెట్ ఆశించి విఫలమై పార్టీ మారిన పోతిన మహేష్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోని జనసేన పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.