Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై సెటైర్లు... రామోజీరావుపై నిప్పులు!

కుట్ర జరుగుతుందనే అనుమానాలున్నాయంటూ తప్పుడు వార్తలు రాస్తారా అంటూ ఫైరయ్యారు పోసాని.

By:  Tupaki Desk   |   16 Sep 2023 1:22 PM GMT
చంద్రబాబుపై సెటైర్లు... రామోజీరావుపై  నిప్పులు!
X

గతంలో ఎన్నడూ లేనివిధంగా రామోజీరావుని ఏకవచనంతో సంభోదిస్తూ ఏపీ ఎఫ్‌.డీ.సీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్‌ రాహుల్ భార్య చనిపోవడంతో ఆయన సెలవుపై వెళ్తే... కావాలనే సెలవుపై పంపారు, కుట్ర జరుగుతుందనే అనుమానాలున్నాయంటూ తప్పుడు వార్తలు రాస్తారా అంటూ ఫైరయ్యారు పోసాని.

అనంతరం... "ఈనాడు" అనే పత్రిక పెట్టి అందులోని అక్షరాలను వేశ్యలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నారని, ఫలితంగా ఆ వేశ్యలుగా మారిన అక్షరాలవల్ల ఎయిడ్స్ తగిలి కుళ్లి కుళ్లి చస్తావంటూ రామోజీ రావుకి శాపనార్ధాలు పెట్టారు పోసాని కృష్ణమురళి. రామోజీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్లరా అని నిలదీశారు.

చంద్రబాబుని బయటకు తీసుకుని రావాలనే తపనే ఉంటే... నిజాలు చెప్పి, నిజాయితీగా బయటకు తీసుకురావాలని, ఇలాంటి వార్తలు రాసి కాదని.. "ఏం జరుగుతోంది?" అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై ఫైరయ్యారు పోసాని. అనంతరం భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై సవివరంగా స్పందిస్తూ సెటైర్లు వేశారు.

అవును... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు.. జైల్లో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై పోసాని తనదైన శైలిలో స్పందించారు. భువనేశ్వరి చేసిన ప్రతీ కామెంట్ పైనా రియాక్ట్ అయ్యారు.

అందులో భాగంగా... చంద్రబాబు జైల్లో సైతం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనటం దుర్మార్గం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే దాన్ని వదిలేసి టీడీపీలోకి వచ్చింది కూడా ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆనాడు ఎన్టీఆర్‌ ను చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా అని అడిగారు.

అనంతరం... "మీ నాన్నని వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమేనా" అని పోసాని కృష్ణమురళి.. నారా భువనేశ్వరిని ప్రశ్నించారు. ఇదే క్రమంలో... తెలంగాణలో ఎమ్మెల్సీ లను కొనడానికి డబ్బులు పంపించింది, ఫోన్ లలో మాట్లాడింది కూడా ప్రజల కోసమేనా అని ప్రశ్నించిన ఆయన... 2014 ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, మంత్రి పదవులు ఆశపెట్టి లాక్కుంది కూడా ప్రజలకోసమేనా అని ప్రశ్నించారు.