Begin typing your search above and press return to search.

ఖైదీలకు వర్క్ ఫ్రం హోం... ఏఏజీ సెటైర్స్ పీక్స్!

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   13 Sep 2023 4:50 AM GMT
ఖైదీలకు వర్క్ ఫ్రం హోం... ఏఏజీ సెటైర్స్ పీక్స్!
X

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో ఒకటి ఇంటినుంచి భోజనం, మెడిసిన్స్ కాగా... రెండోది హౌస్ రిమాండ్! అయితే మొదటి పిటిషన్ పై మానవతా ధృక్పదంతో స్పందించిన ప్రభుత్వం ఆ పిటిషన్ పై కౌంటర్ కూడా వేయలేదు!

అయితే రెండో పిటిషన్ "హౌస్ రిమాండ్" పై మాత్రం ఏఏజీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య వాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హౌస్ రిమాండ్ అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు భద్రత, సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని.. మాజీ సీఎంకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జైళ్ల డిప్యూటీ జనరల్ నుంచి లేఖ అందిందని పొన్నవోలు మీడియాకు వెల్లడించారు. 24×7 సీసీటీవీ పర్యవేక్షణతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నారని, ఆయన వార్డు పక్కనే వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఏఏజీ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన కూడా వర్క్ ఫ్రం హోం అడగడం ఏమిటని అన్నారు. ఈ లెక్కన ఈ ఆప్షన్ ని ఈయన అనంతరం ఖైదీలంతా వాడుకుంటారని తెలిపారు. ఖైదీలకు వర్క్ ఫ్రం హోం అనే ఆప్షన్ సరైన ఆలోచన కాదని స్పష్టం చేశారు.

అంతకంటే ముందు మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ పై ఏసీబీ కోర్టులో ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలను వినిపించాయి. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ పైనే విచారణ జరిపింది. ఈ క్రమంలో చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రాణహాని ఉందని.. ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉందని.. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారని కోర్టుకు వివరించారు. కరుడుకట్టిన నేరగాళ్లు ఉన్న జైలులో చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గిందని, సందేహాలున్నాయని లూథ్రా వాదనలు వినిపించారు. ఫలితంగా హౌస్ కస్టడీకి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.

మరోవైపు చంద్రబాబుకు హౌస్ కస్టడీ అక్కర్లేదని సీఐడీ తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు హౌస్ కస్టడీ అనేది సీఆర్పీసీలో లేదని అన్నారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, భద్రత మధ్య ఉన్నారని కోర్టుకు వివరించారు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుందని.. ఆయన ఆరోగ్యం కోసం 24×7 వైద్యులు అందుబాటులో ఉన్నారని న్యాయమూర్తికి సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.