Begin typing your search above and press return to search.

నారాయణకు సీఐడీ నోటీసులు... లోకేష్ తో ఫేస్ టు ఫేస్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత మూడు వారాలకు పైగా ఉంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2023 8:33 AM GMT
నారాయణకు సీఐడీ నోటీసులు... లోకేష్ తో ఫేస్ టు ఫేస్?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత మూడు వారాలకు పైగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం విచారణ ఊపందుకున్నట్లుంది! ఇందులో భాగంగా సీఐడీ కీలక స్టెప్ వేసిందని అంటున్నారు!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం తర్వాత ఏపీ సీఐడీ దృష్టి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం పై ఉన్నట్లుగా ఉందని అంటున్నారు. ఈ కేసులో ఏ-1 గా ఉన్న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండగా.. ఏ-2 గా ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. మరోపక్క ఏ-14 గా ఉన్న లోకేష్ కు ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ వెళ్లి మరీ సీఐడీ నోటీసులు ఇచ్చింది!

ఈ నేపథ్యంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్‌ స్కాం కేసులో.. ఏ-2 గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు పంపించింది. ఇందులో భాగంగా విచారణకు రావాల్సిందిగా నోటీసులను వాట్సప్ చేసిందని తెలుస్తుంది. అక్టోబర్‌ 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.

దీంతో ఈ స్కాం లోనే కాకుండా.. నాటి ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్నట్లు చెబుతున్న మాజీ మంత్రులైన నారాయణ, లోకేష్ లు ఇద్దరినీ ఒకే రోజు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. దీంతో... అక్టోబర్ 4న ఏపీ సీఐడీ ఆఫీసులో ఆ రోజు ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. దీంతో... వీరిద్దరినీ ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి విచారిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క అక్టోబరు 4.. అదే రోజు సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది! అయితే అంతకంటే ఒకరోజు ముందు (అక్టోబర్ 3)న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ బెంచ్ పైకి రానుందని తెలుస్తుంది! దీంతో రాబోయే రెండు రోజులూ.. అత్యంత కీలకంగా ఉన్నాయని అంటున్నారు!

ఈ క్రమంలో సీఐడీ అధికారులు అందించిన నోటీసులపై నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... సీఐడీ నోటీసుల ప్రకారం ఈనెల 4న విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు అడిగిన అన్ని వివరాలనూ వెల్లడిస్తానని తెలిపారూ. అయితే... ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంవల్ల అంతకుమించి ఈ విషయం స్పందించను అని నారాయణ తెలిపారు.