Begin typing your search above and press return to search.

బాబు కంటే ఎక్కువగా జగన్ మీద పగ పట్టిందెవరు....?

అందరూ ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న పాలిటిక్స్ నే చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 1:30 AM GMT
బాబు కంటే ఎక్కువగా జగన్ మీద పగ పట్టిందెవరు....?
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి శతృవులు కానీ ప్రత్యర్ధులు కానీ ఎవరూ అంటే జవాబు ఒక పట్టాన చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ప్రత్యర్ధులు శతృవుల లిస్ట్ చాలా పెద్దది కాబట్టి. జగన్ వైఎస్ మరణాంతరం సీరియస్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. ఆదిలో ఆయన తండ్రి శత్రువులే ఆయనకు శతృవులు అయ్యారు. ఆ తరువాత కాలంలో జగన్ వ్యూహాలు వాటితో పాటు విజయాలు ఆయన దూకుడు ఇవన్నీ కలిపి మరింత మంది శతృవులు పెరిగేలా చేసింది.

అందరూ ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న పాలిటిక్స్ నే చూస్తున్నారు. కానీ తెర వెనక పెద్ద వారితోనే వైసీపీ అధినాయకత్వం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా యుద్ధం చేస్తోంది అని అంటున్నారు. మీట ఒక చోట నొక్కితే వెలుగు మరోచోట వస్తుంది. అలా ఇపుడు ఏపీ రాజకీయాలు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అల్లుకుపోయి ఉన్నాయి.

దాంతో ఎన్నికల వేళ జగన్ ప్రత్యర్ధులు అందరూ ఏకం అవుతున్నారని అంటున్నారు. ఇక నాడు అంటే 1995లో చంద్రబాబుని ఎన్టీయార్ ని సైతం కాదని సీఎం ని చేయడంతో టీడీపీ వారితో పాటు తెర వెనక పెద్దలు కొందరు కీలక పాత్ర పోషించారు. వారే ఇపుడు మరోసారి బాబు విషయంలో చొరవ తీసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

చిత్రమేంటి అంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా వారి మీద కూడా కేసులు ఉన్నాయి. జగన్ వచ్చాక అవి వేగం పుంజుకున్నాయి. సుప్రీం కోర్టు దాకా వెళ్లిన ఆ కేసులలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ చంద్రబాబుల మధ్య నా ముందరా అన్నట్లుగా ఆ పెద్ద మనుషులూ ఉన్నారని అంటున్నారు.

వారి డైరెక్షన్ లోనే ఏపీలో సడెన్ గా పొత్తుల కధ కుదిరిందని, అంతే వేగంగా ఢిల్లీ స్థాయిలో చక్కబెట్టేందుకు లోకేష్ బయల్దేరి వెళ్లారని అంటున్నారు. తమాషా ఏంటి అంటే వైసీపీ అధినాయకత్వానికి కూడా ఏ తీగ ఎక్కడ కదులుతోందో ఎక్కడ ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అంతా తెలుసు అంటున్నారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక జోస్యం చెప్పేశారు. చంద్రబాబు అరెస్ట్ పెద్ద విషయం కాదు, మరో పెద్ద అరెస్ట్ రెడీ గా ఉంది అంటూ దానికి డేట్ టైం ఫిక్స్ చేసేశారు. అక్టోబర్ 30న ఆ అరెస్ట్ ఉంటుంది అని ఆయన చెబుతున్నారు. మరి ఎవరా పెద్ద మనిషి అని ఎవరికి వారికే డౌట్లు వచ్చినా రాజకీయ విశ్లేషణలలో ఆరితేరిన వారు మాత్రం ఆ గురువు ఎవరో పోల్చేస్తున్నారు అంటున్నారు.

ఏది ఏమైనా ఏపీలో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ అధినాయకత్వం ఒక్కరితో పోరాడడం లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా సీన్ ఉంది. ఆ అదర్స్ లో కేవలం విపక్షాలే లేవు, చాలా కీలక వ్యవస్థలు, వాటి అధిపతులూ కూడా జట్టుకట్టి ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఏ తీరం చేరుతుందో. ఎవరి చాణక్యం నెగ్గుతుందో.