Begin typing your search above and press return to search.

సంక్రాంతి గుండాటలో జగన్, పవన్, సీబీఎన్... బికీనీ గర్ల్!

ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ఫోటోలు కనిపించాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2024 7:27 AM GMT
సంక్రాంతి గుండాటలో జగన్, పవన్, సీబీఎన్... బికీనీ  గర్ల్!
X

సంక్రాంతి పండగ వేళ ఏపీలో కోడిపందేలతోపాటు అదేస్థాయిలో వినిపించేమాటల్లో గుండాట ఒకటి! పందాలకు పర్మిషన్ ఇచ్చారా.. మరి గుండాటకో? అనేది సంక్రాంతికి రెండు రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపించేమాటల్లో ఒకటి! పరిస్థితులు ఎలాంటివైనా... ప్రతీఏటా అప్పటి అధికారపార్టీ నేతల అండదండలతో పందెం బరులతోపాటు ఈ గుండాట కూడా సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం ఐపోయిందనే మాటలు వినిపిస్తుంటాయి.

ఈ క్రమంలో అప్పుడప్పుడూ గుండాటలు ఆడుతూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలు రకాల ప్రజాప్రతినిధులు కెమెరాల కంటికి చిక్కుతుంటారు. ప్రజలకోసం, కార్యకర్తల కోసం, అభిమానులకోసం తప్పలేదని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటివరకూ సాధారణంగా నెంబర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లతోనే ఎక్కువగా కనిపించే గుండాట బోర్డు.. ఇప్పుడు పొలిటీషియన్స్ తో దర్శనమిచ్చింది.

అవును... ఎన్నికల ఏడాది కావడంతోనో ఏమో కానీ... తాజాగా జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో గుండాట బోర్డులో డిఫరెంట్ ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ఫోటోలు కనిపించాయి. వీరిఫోటోలతో పాటు పక్కనే బికినీ గర్ల్ పిక్ కూడా ఉండటం గమనార్హం.

ఇక ఆ బోర్డు పెట్టి మొదలుపెట్టగానే.... పవన్ పై పాతిక, బికినీపై ఏభై, బాబుపై వంద, జగన్ పై 200 అంటూ కుర్రాళ్లు నోట్లు చేతపట్టి ఎగబడిపోయారు. ఈ సమయంలో కొంతమందిని జగన్ రక్షిస్తే, మరికొంతమందిని చంద్రబాబు, పవన్ లతోపాటు బికినీగర్ల్ కూడా రక్షించింది.. కొన్ని సందర్భాల్లో భక్షించబడటమూ జరిగింది! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా... ఆదివారం భోగి పండగతో మొదలైన ఈ సంక్రాంతి సంబరాలు సోమవారం సంక్రాతి, నేడు ముక్కనుమతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా పట్టణాలను ఖాళీచేసి పల్లెలకు వెళ్లిన ప్రజానికం.. బుధవారం నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు! ఏడాదికి సరిపడా ఆనందాన్ని వెంటబెట్టుకుని.. నగర జీవనానికి ప్రయాణమవుతున్నారు.