బాబు కలల ప్రాజెక్టుకు 'మట్టి' పరీక్ష!
ఏపీ సీఎం చంద్రబాబు కలలు కంటున్న కీలక ప్రాజెక్టు పోలవరం. దీనిని 2029 లోపే పూర్తి చేసి.. ప్రారం భించాలని కూడా ఆయన నిర్ణయించారు.
By: Tupaki Desk | 17 April 2025 11:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు కలలు కంటున్న కీలక ప్రాజెక్టు పోలవరం. దీనిని 2029 లోపే పూర్తి చేసి.. ప్రారం భించాలని కూడా ఆయన నిర్ణయించారు. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాకు కూడా.. ``పోలవరం ప్రారంభోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు ఎంత బిజీగా ఉన్నా.. రావాల్సిందే`` అని తేల్చి చెప్పి ముందస్తు ఆహ్వానం కూడా పలికారు. అలా.. కీలకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు `మట్టి` పరీక్ష పెడుతోంది.
వరదులు.. ఆటు పోట్ల కారణంగా.. భూమిలో లవణాలు కోల్పోయినట్టు ప్రాజెక్టు రంగ నిపుణులు చెబుతు న్నారు. కొన్ని మీటర్ల లోతుకు వెళ్తే.. మట్టికి ఆకర్షణా శక్తి తగ్గి.. పట్టు పెంచుకునే లక్షణం కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ.. రెండు రోజుల కిందట.. మృత్తికా పరీక్షల నిపుణులను పోలవరం ప్రాజెక్టు వద్దకు పంపించింది. సదరు అధికారులు పోలవరం చుట్టుపక్కల చేపట్టా ల్సిన నిర్మాణాలకు సంబంధించి మట్టి పరీక్షలు చేస్తున్నారు.
సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి. సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిధిలోని దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షించడం తో పాటు, మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయం లో పరీక్షించేందుకు సేకరించారు.
స్థానికంగా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలి తాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకవేళ మట్టిలో నాణ్యత లోపిస్తే.. ఏం చేయాలన్న దానిపై నిపుణుల కమిటీ చర్చించి.. నిర్ణయం తీసుకోనుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వరదలు.. భూమిలోపల సంభవించే ఆటుపోట్ల కారణంగానే.. నాణ్యత లోపిస్తుందని.. అలాంటి చోట భారీ నిర్మాణాలుచేపట్టినా.. సుదీర్ఘకాలం మన్నికగా ఉండబోవన్నది వారి వాదన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
